పై-లిన్ తుపాను బాధితుల్ని పరామర్శించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బుధవారు శ్రీకాకుళం చేరుకున్నారు.ఇచ్చాపురం నియోజకవర్గంలో ఆమె పర్యటన కొనసాగుతోంది. ఇచ్చాపురం నియోజకవర్గం కంచలి వెళ్తారు. ఆ మండలంలోని పెద్దకొజ్జిరియా, జాడుపూడి ప్రాంతాల్లో పర్యటిస్తారు. అనంతరం కవిటి మండలం రాజపురం, జగతి, ఇద్దివానిపాలెంతోపాటు కళింగపట్నం వెళ్తారు. అక్కడి నుంచి సోంపేట మండలం ఇసుకలపాలెం చేరుకొని అటు తరువాత తలతంపర మీదుగా బారువ వెళ్తారు. ఆయా ప్రాంతాల్లో తుఫాన్ నష్టాలను పరిశీలించడంతోపాటు బాధితులను పరామర్శించి వారి కష్టనష్టాలను స్వయంగా అడిగి తెలుసుకుంటారు. విజయమ్మతో పాటు పార్టీ నేతలు ధర్మాన కృష్ణాదాసు, కొణతాల రామకృష్ణ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అంతకు ముందు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న విజయమ్మకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా జై జగన్ నినాదాలతో విమానాశ్రయ ప్రాంగణం మారుమ్రోగింది. వారందరికీ అభివాదం చేస్తూ విజయమ్మ శ్రీకాకుళం పర్యటనకు బయల్దేరారు.
Oct 16 2013 10:36 AM | Updated on Mar 22 2024 11:31 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement