గ్రామాల్లో బెల్టు షాపులు లేకుండా చేస్తా: జగన్ | ys jagan mohan reddy promises to remove belt shops in villages | Sakshi
Sakshi News home page

Apr 2 2014 8:50 PM | Updated on Mar 21 2024 7:53 PM

మరో 36 రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో ప్రజల మనసు ఎరిగిన నాయకుడ్ని గెలిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో వైఎస్ఆర్ జనభేరిలో అశేష జనాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. నిరుపేదల కోసం తపించిన ఒకే ఒక వ్యక్తి వైఎస్ఆర్ అన్నారు. పేదవాడికి వైద్యం భారం కాకూడదని, కార్పొరేట్ వైద్యం నిరుపేదకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారని తెలిపారు. ప్రజల హృదయాల్లో వైఎస్ఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. కాంగ్రెస్‌తో చంద్రబాబు కలిసిపోయి రాష్ట్రాన్ని చంద్రబాబు అడ్డగోలుగా విభజించారని చెప్పారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి రాగానే రాష్ట్ర దశదిశ మార్చే 5 సంతకాలు చేస్తానని జగన్ హామీయిచ్చారు. అమ్మఒడి పథకం అమలుపై తొలి సంతకం చేస్తానని అన్నారు. అవ్వాతాతల కోసం రెండో సంతకం, స్థిరీకరణ నిధి కోసం మూడో సంతకం, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తూ నాలుగో సంతకం, గ్రామాల్లో ఇబ్బందులు పడుతున్న ప్రజల బాగు కోసం ఐదో సంతకం చేస్తానని వెల్లడించారు. గ్రామాల్లో బెల్టు షాపులు లేకుండా చేస్తానని జగన్ హామీయిచ్చారు. పార్వతీపురం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రసన్నను, అరకు వైఎస్ఆర్ సీపీ ఎంపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీతను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement