కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరిన్నీ రైళ్లు కేటాయించాలని సురేష్ ప్రభుకు వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ బేటీలో వైఎస్ జగన్ వెంట ఆ పార్టీ ఎంపీలు కూడా ఉన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఏ 1గా చేర్చాలని వైఎస్ జగన్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ అంశంపై ఢిల్లీ పర్యటనలో ఉన్న వైఎస్ జగన్ ఇప్పటికే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలసి విజ్ఞప్తి చేసిన విషయం విదితమే.
Jun 10 2015 6:32 PM | Updated on Mar 22 2024 11:30 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement