ఓటుకు నోటు కేసులో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య 19 సాయంత్రం అయిదు గంటల లోపు ఏసీబీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని ఏసీబీ సూచించింది. సండ్ర వెంకట వీరయ్యకు నిన్నరాత్రే ఏసీబీ సెక్షన్ 160 కింద నోటీసులు జారీచేసింది. విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది.