పెద్ద నోట్ల రద్దు నల్లధనం నిర్మూలనలో కీలక చర్య అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నల్లకుబేరులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలి పెట్టబోమని హెచ్చరించారు. మోపా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... నల్లధనంపై ప్రాణంపోయినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దు ప్రజలంతా హాయిగా నిద్రపోయారని, కొంతమంది మాత్రం నిద్రపోలేకపోయారని వ్యాఖ్యానించారు. అవినీతికి వ్యతిరేకంగా 2014లో తమకు ప్రజలు ఓటు వేశారని చెప్పారు. నిజాయితీపరుల కోసం కీలక అడుగులు వేస్తున్నామన్నారు. తనకు పదవీ వ్యామోహం లేదని, అహంకారంతో పెద్ద నోట్లను రద్దు చేయలేదని అన్నారు.