రాష్ట్రాన్ని ముక్కలు చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ బుధవారం సీమాంధ్ర భగ్గుమంది. అన్ని జిల్లాల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. విభజనకు వ్యతిరేకంగా జేఏసీ, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో 72 గంటల బంద్ పిలుపు మేరకు ఉద్యమకారులు రోడ్లపై బైఠాయించడంతో ప్రజాజీవనం స్తంభించిపోయింది. సమైక్యవాదుల నిరసనతో అనంతపురం అగ్నిగుండమైంది. నగరంలోని సప్తగిరి సర్కిల్, టవర్‌క్లాక్ వద్ద ఉన్న రాజీవ్, ఇందిరా గాంధీ విగ్రహాలను ధ్వంసం చేసి.. చెప్పులతో కొట్టారు. కాంగ్రెస్, బీజేపీ కార్యాలయాలలో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలపై దాడిచేశారు. టవర్‌క్లాక్ వద్ద పోలీసులు, ఆందోళనకారులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. పరిస్థితి అదుపు తప్పుతోందని భావించిన పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి, గాల్లోకి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన రాయలసీమ ఐజీ రాజీవ్ రతన్, జిల్లా ఎస్పీ శ్యాంసుందర్‌ల వాహనాలపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఎస్పీ.. వాహనం దిగి సమీపంలోని పెట్రోల్ బంక్‌లోకి వెళ్లి తలదాచుకున్నారు.
Aug 1 2013 9:49 AM | Updated on Mar 22 2024 11:25 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement