‘420 సర్కారు ఇచ్చిన 470 జీవో వద్దు’ | vasireddy padma demand to cancel 470 GO | Sakshi
Sakshi News home page

Nov 11 2016 1:23 PM | Updated on Mar 22 2024 11:05 AM

ఆంధ్రప్రదేశ్‌ లో విచ్చలవిడి మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం దారుణమని వైఎస్సార్‌ సీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... బీచ్‌ పార్లర్ల పేరుతో సముద్రతీర ప్రాంతాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఏపీని చంద్రబాబు మద్యాంధ్రప్రదేశ్ గా మారుస్తున్నారని మండిపడ్డారు. పాదయాత్ర సందర్భంగా మహిళలకు ఏం చెప్పారో గుర్తు చేసుకోవాలని సూచించారు. రెండున్నర కోట్ల మహిళల గోడు మీకు వినపడడం లేదా అని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement