ఆంధ్రుల రాజధాని అమరావతి కీలక ప్రాంతమంతా (కోర్ ఏరియా) తుళ్లూరు పరిసరాల్లోనే కేంద్రీకృతమైంది. ప్రభుత్వ కీలక నిర్మాణాలన్నీ తుళ్లూరు, రాయపూడి గ్రామాల్లోనే నిర్మితం కానున్నాయి. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, రాష్ట్ర మంత్రుల నివాస గృహాలు, సిటీ గ్యాలరీ తదితర నిర్మాణాలు తుళ్లూరు పరిసరాల్లోనే నిర్మిస్తారని ‘సాక్షి’ ముందుగానే వెల్లడించింది. ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించకముందే తుళ్లూరు ప్రాంతంలో రాజధాని ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. తుళ్లూరు కేంద్రంగానే భూ సమీకరణను ప్రభుత్వం ప్రారంభించింది.
Jul 21 2015 7:32 AM | Updated on Mar 20 2024 2:09 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement