అర్బన్ ప్లానింగ్ నిపుణుల సూచనల మేరకు సింగపూర్ ప్రభుత్వం ఇచ్చిన రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో సీఆర్‌డీఏ అధికారులతో రాజధాని వ్యవహారాలపై ఆయన సమీక్ష నిర్వహించారు.