ఒకేసారి లక్షమంది భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బంది, అసౌకర్యం తలెత్తని విధంగా యాదాద్రి ఆలయం రూపొందాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. సాఫీగా స్వామి దర్శనం చేసుకుని భక్తులు సంతృప్తితో తిరిగి వెళ్లేలా పరిస్థితులు ఉండాలని పేర్కొన్నారు. ‘‘తెలంగాణలో యాదాద్రి ప్రధాన ఆలయం. యాదగిరి, లక్ష్మి నరసింహం, నరసింహ, నరసింహారావు, యాదయ్య... ఇలాంటి పేర్లు లేని ఊళ్లుండవు, మాఘం, చైత్యం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, ఫాల్గుణ మాసాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. కొంతకాలంగా సెలవు రోజుల్లో రద్దీ బాగా పెరిగింది. ఇలా ఒకేరోజు లక్ష మంది వస్తే సంతృప్తికర దర్శనంతోపాటు అందరికీ మంచి వసతి దొరకాలి, ఎక్కడా ట్రాఫిక్ చిక్కులు ఉండొద్దు.