రేవంత్‌కు షరతులతో బెయిల్ | Revanth reddy grants conditional bail for note for vote case | Sakshi
Sakshi News home page

Jul 1 2015 7:15 AM | Updated on Mar 22 2024 10:56 AM

‘ఓటుకు కోట్లు’ కేసులో ప్రధాన నిందితులు రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయ సింహలకు హైకోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రేవంత్ తన నియోజకవర్గం కొడంగల్ దాటి బయటకు రాకూడదని, ముగ్గురు నిందితులు పాస్‌పోర్టులు స్వాధీనం చేయడంతోపాటు రూ.5లక్షల చొప్పున పూచీకత్తులు సమర్పించాలని న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో ఆదేశించారు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేయాలని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రూ.5కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని రూ.50లక్షలు అడ్వాన్స్‌గా ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికిపోయిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement