రాష్ట్రాన్ని కుదిపేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ కేసు దర్యాప్తులో మరో ముందడుగు. ఈ కేసులో మరో కీలక నిందితుడిని ఎక్సైజ్‌శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నెదర్లాండ్స్‌కు చెందిన మైక్ కమింగా అనే వ్యక్తిని అరెస్టు చేశామని, అతడి నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలంగాణ ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ మీడియాకు వెల్లడించారు. 33 ఏళ్ల మైక్ కమింగా నాలుగుసార్లు భారత్‌కు వచ్చాడని, అతని వద్ద భారతీయ పాస్‌పోర్టు ఉందని, దాని గడువు ముగిసినా ఇంకా భారత్‌లోనే అతను ఉన్నాడని చెప్పారు. మైక్ కమింగా కోర్టు ముందు హాజరుపరుస్తామని చెప్పారు. మల్టీ నేషనల్ కంపెనీల ఉద్యోగులకు డ్రగ్స్ సరఫరా చేయడంలో కమింగాది కీలక పాత్ర అని తెలుస్తోంది. పలు సాఫ్ట్ వేర్ కంపెనీల ఉద్యోగులకు కమింగా డ్రగ్స్ అందిస్తున్నట్టు సమాచారం.