వైఎస్ రాజశేఖరరెడ్డే ఉండి ఉంటే రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు తలెత్తేవే కావని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అభిప్రాయపడ్డారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు. విభజన ప్రకటనతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించేందుకు విజయమ్మ నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మంగళవారం ప్రధానిని కలిశారు.