మాచర్ల ఎస్‌బీఐ క్యూ వద్ద విషాదం చోటుచేసుకుంది. డబ్బుల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద క్యూలో నిలబడిన మౌలాలీ అనే వృద్ధుడు అకస్మాత్తుగా సొమ్మసిల్లి కిందపడిపోయాడు. తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. పింఛను డబ్బుల కోసం రెండు రోజులుగా ఏటీఎంల చుట్టూ మౌలాలీ తిరుగుతున్నట్లు తెలిసింది.