రాత్రీపగలు లేదు.. ఉదయం సాయంత్రం లేదు.. ఇక నుంచి ఎప్పుడైనా మందు గ్లాసులు గలగలలాడనున్నాయి.. ఉదయం 6 నుంచి అర్ధరాత్రి 3 వరకు బార్లన్నీ తెరిచే ఉండనున్నాయి. హైదరాబాద్‌లో పర్యాటక రంగం అభివృద్ధి, విదేశీ టూరిస్టులను ఆకర్షించేందుకు బార్లు, స్టార్ హోటళ్లు, టూరిజం హోటళ్లలో ప్రతిరోజూ 24 గంటలూ మద్యం విక్రయాలు జరిపేందుకు ఎక్సైజ్ శాఖ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే అవసరం, అవకాశాన్ని బట్టి తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు మాత్రం స్వల్ప విరామం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.