'చంద్రబాబు పిచ్చి కారణంగానే ప్రమాదం'

రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రాజమండ్రి పుష్కర ఘాట్ లో తొక్కిసలాట జరిగిందని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. ఈ దుర్ఘటనకు సీఎం చంద్రబాబుదే బాధ్యత అని అన్నారు. చంద్రబాబుకు ఉన్న ప్రచార యావ కారణంగానే ఈ దారుణ ఘటన జరిగిందని దుయ్యట్టారు. బుధవారం మధ్యాహ్నం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆమె ఇంకా ఏమన్నారంటే...

* చంద్రబాబు పూజలు చేస్తున్న సమయంలోనే లక్షల మంది బయట వేచి చూస్తున్నారు.
* సీఎం ఘాట్ కు వచ్చేటప్పటికే జనం కిక్కిరిసి ఉన్నారు
* ప్రభుత్వమే కావాలనే భక్తులందరినీ ఒకే ఘాటుకు తరలించింది
* భక్తులు తమంతట తామే అక్కడికి వచ్చారని తప్పుదారి పట్టిస్తున్నారు
* సీఎం పూజ చేస్తున్న సమయానికి జనం పోటెత్తారని చెప్పడానికే ఇదంతా చేశారు
* లఘుచిత్రం కోసం ఫోటోలు తీసుకునేందుకే ఇలా చేశారు
* ఫోటోలు బాగా రావాలన్న ఆలోచనతో భక్తుల భద్రతను గాలికి వదిలేశారు
* భారీ జనసందోహం కనబడే దాకా సీఎం పూజ కార్యక్రమం నిర్వహించారు
* మూడు గంటల పాటు జనాన్ని పుష్కర ఘాట్ బయట ఆపేశారు
* ప్రచార యావతో జరిగిన తప్పిదం ఇది
* ప్రభుత్వ నిర్లక్ష్యంగానే ప్రాణనష్టం జరిగింది
* చంద్రబాబు పిచ్చిని ప్రజలు గమనిస్తున్నారు
* బాబుకు మీడియా పిచ్చి, ప్రచార పిచ్చి ఉంది
* తన వల్ల తప్పు జరిగినందుకు సీఎం క్షమాపణ చెప్పారా?
* తన వల్ల ఈ తప్పు జరిగిందని చెప్పుకుంటే ఏమౌతుంది?
* చంద్రబాబు కంటతడి పెట్టారని మీడియా సలహాదారు చెబుతారు
* చంద్రబాబు ప్రతిదీ మేనేజ్ చేయాలనుకుంటారు
* న్యాయవిచారణకు ఆదేశించే నైతిక చంద్రబాబుకు ఎక్కడుంది
* చంద్రబాబు పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారా, లేదా?
* తొక్కిసలాట ఘటనపై సమగ్ర నివేదిక ప్రభుత్వం వద్ద లేకపోవడం దారుణం
* తొక్కిసలాట ఘటన బయటకు రాకుండా మీడియా గొంతు నొక్కాలనుకున్నారు
* తొక్కిసలాట దృశ్యాలు బయటకు రాకుండా చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top