తుపాకుల మోతతో అనంతపురం జిల్లా హిందూపురం దద్దరిల్లింది. కునిగల్ గిరి ముఠా, బెంగళూరు పోలీసుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. కునిగల్ గిరిపై 100కుపైగా దోపిడీ కేసులున్నాయి. కర్ణాటక పోలీసుల వేటతో కునిగల్ గిరి హిందూపురంలో తలదాచుకున్నాడు. గిరి క్యాంప్‌పై సీనియర్ ఐపీఎస్ నేతృత్వంలో పోలీసులు దాడి చేశారు. పోలీసుల కాల్పుల్లో గిరికి గాయాలయ్యాయి. అతడికి హిందూపురంలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గిరి నుంచి 2 రివాల్వర్లు, రెండు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్‌లో గిరి ముఠా సభ్యుడు గోవింద కూడా గాయపడ్డాడు. బెంగళూరు అంబేద్కర్ ఆసుపత్రిలో గోవిందకు చికిత్స అందిస్తున్నట్టు బెంగళూరు పోలీసు కమిషనర్ రాఘవేంద్ర హౌరాద్కర్ తెలిపారు.
May 18 2014 4:27 PM | Updated on Mar 21 2024 6:37 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement