తెనాలి మాజీ ఎంపీ బాలశౌరి శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చంచల్గూడ జైల్లో కలిశారు. భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ తాను జగన్ను మర్యాదపూర్వకంగానే కలిసినట్లు తెలిపారు. వైఎస్ఆర్ మరణం తర్వాత రాష్ట్రంలో ఏర్పడ్డ పరిస్థితుల్ని చక్కదిద్దే సత్తా ఒక్క జగన్కే ఉందన్నారు. త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు బాలశౌరి ప్రకటించారు. బాలశౌరితో పాటు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బాలశౌరీ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి గత నెల మొదటివారంలోనే రాజీనామ చేశారు. లోక్సభ ఎన్నికల్లో వల్లభనేని బాలశౌరి తెనాలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఇటీవల గుంటూరులో చేపట్టిన సమర దీక్షకు బాలశౌరి మద్దతు కూడా ప్రకటించారు
Sep 13 2013 12:27 PM | Updated on Mar 22 2024 11:31 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement