విభజనపై దిగ్విజయ్ సంచలన వ్యాఖ్యలు | Digvijay Sensational Comments about Telangana Issue | Sakshi
Sakshi News home page

Jul 11 2013 7:40 PM | Updated on Mar 21 2024 7:52 PM

తెలంగాణ అంశంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్‌సింగ్ వార్తా సంస్థ పిటిఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇస్తామని 2004 ఎన్నికల్లో తాము హామీ ఇవ్వలేదని చెప్పారు. తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో తాము రెండో ఎస్సార్సీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. తెలంగాణ విషయమై యుపిఏ మిత్రపక్షాలు, ప్రతిపక్షాలతో సంప్రదించవలసి ఉంటుందని చెప్పారు. రాజ్యాంగ సవరణ చేయవలసి ఉన్నందున వారితో సంప్రదించవలసి ఉందన్నారు. రాజ్యాంగ సవరణ అవసరమైతే ప్రతిపక్షాల సహకారం అవసరం ఉంటుందని తెలిపారు. అస్పష్టతకు తావులేని విధంగా నిర్ణయం ఉంటుందని చెప్పారు. తెలంగాణ అంశంపై నిర్ణయాన్ని ఇక వాయిదా వేసే ప్రసక్తిలేదన్నారు. సమైక్యమా? తెలంగాణ? అనే రెండు కోణాలకు ద్వారాలు తెరిచే ఉన్నాయని ఆయన తెలిపారు. గందర గోళానికి తావు లేకుండా తెలంగాణపై నిర్ణయం ఉంటుందని చెప్పారు. ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్ర మంత్రులతో కలిసిన కోర్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని అవసరమైన రాజకీయ వ్యూహంతో రోడ్మ్యాప్ తయారు చేయమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలను కోరనట్లు చెప్పారు. వారంతా రేపు కోర్ కమిటీ ముందు ప్రజెంటేషన్ ఇస్తారని తెలిపారు. ప్రతి నిర్ణయానికి లాభనష్టాలు ఉంటాయని చెప్పారు. దాన్ని అమలు చేయడమే తమ బాధ్యత అన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement