మహాభారతం గురించి విన్నారు కదా.. టీవీలలో కూడా చాలామంది బీఆర్ చోప్రా తీసిన మహాభారతం సీరియల్ కూడా చూసే ఉంటారు. అందులో పాండవుల పేర్లు ఐదూ మీకు తెలుసు కదూ. మరి కౌరవుల పేర్లు తెలుసా? దుర్యోధనుడు, దుశ్శాసనుడు .. వీళ్లిద్దరి పేర్లు చాలామంది చెబుతారు. మహా అయితే మరికొందరు మాత్రం పాండవ పక్షపాతి అయిన వికర్ణుడి పేరు కూడా చెప్పగలరు. కానీ మొత్తం అందరి మంది పేర్లు చెప్పగలరా? పిల్లలే కాదు.. పెద్దవాళ్లలో కూడా నూటికి 99 మందికి ఆ పేర్లు తెలియకపోవచ్చు. అందుకే.. పిల్లలు, పెద్దవాళ్లు అందరికీ విజ్ఞానం పెంచేందుకు కల్చర్ మెషీన్, షిట్జెంజిగిల్స్ అనే గ్రూపు ఒక అద్భుతమైన వీడియోను రూపొందించింది. కరావోకే స్టైలులో కలిసి పాడేలా ఈ కౌరవుల పాటను వారు రూపొందించారు. ఈ పాటను చూస్తే మొత్తం కౌరవులందరి పేర్లూ ఇట్టే తెలిసిపోతాయి. సరదాగా ఈ పాట చూడండి..
Jun 26 2014 5:05 PM | Updated on Mar 21 2024 6:35 PM
Advertisement
Advertisement
Advertisement
