ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా నిర్మించి.. భారీ అంచనాల నడుమ విడుదలై.. రికార్డులను బద్దలు కొడుతున్న బాహుబలి చిత్రం.. మరో చరిత్ర సృష్టించింది. బాక్సాఫీసు వద్ద కనకవర్షం కురిపిస్తున్న బాహుబలి నాలుగు వారాల్లోనే 500 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. 500 కోట్ల మార్క్ దాటిన తొలి దక్షిణాది చిత్రంగా బాహుబలి రికార్డు నెలకొల్పింది. ఇంతకుముందు అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణాది చిత్రాలకు అందనంత ఎత్తులో నిలిచింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఎంతిరన్ చిత్రం అత్యధికంగా 283 కోట్ల రూపాయలు రాబట్టింది. ఈ రికార్డును 9 రోజుల్లోపే బాహుబలి బ్రేక్ చేయడం విశేషం. తక్కువ సమయంలో 100, 200, 300 కోట్లు రూపాయలను వసూలు చేసిన భారతీయ చిత్రంగా బాహుబలి రికార్డులు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే.
Aug 3 2015 6:24 PM | Updated on Mar 22 2024 10:47 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement