ఊరికి సర్పంచే సుప్రీం | - | Sakshi
Sakshi News home page

ఊరికి సర్పంచే సుప్రీం

Dec 1 2025 1:15 PM | Updated on Dec 1 2025 1:15 PM

ఊరికి

ఊరికి సర్పంచే సుప్రీం

రామన్నపేట,చిట్యాల : గ్రామానికి సంబంధించిన సర్వాధికారాలు పంచాయతీవే. గ్రామపంచాయతీలో సర్పంచే సుప్రీం. గ్రామసభల తీర్మానాలే శాసనాలు. పంచాయతీరాజ్‌ 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంచాయతీరాజ్‌ వ్యవస్థలో ఐదెంచెల విధానం అమలులోకి వచ్చింది. ఈ చట్టం గ్రామపంచాయతీలకు విశేష అధికారాలను కట్టబెట్టింది.

గ్రామంలో వసతుల కల్పన

గ్రామంలోని సమస్యల పరిష్కార వేదికగా గ్రామ పంచాయతీ ఉంటుంది. గ్రామపంచాయతీ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు అత్యంత కీలకమైనవి. గ్రామంలోని రోడ్లు, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధిదీపాల ఏర్పాటుతో పాటు పలు సౌకర్యాల కల్పనకు సంబంధించిన అంశాలను సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఈ సమావేశాలకు సర్పంచ్‌ అధ్యక్షత వహిస్తారు. గ్రామపంచాయతీ పాలకవర్గం గ్రామాభివృద్ధి కోసం చేపట్టిన పనులు, ఖర్చులు, భవిష్యత్‌లో చేపట్టబోయే పనులు, పథకాలకు అయ్యే ఖర్చులు, ఆదాయ వ్యయాలను ప్రజల దృష్టికి తీసుకు వచ్చేందుకు గ్రామసభను నిర్వహిస్తారు. ఈ సభలో చేసే తీర్మానాలను గ్రామచట్టాలుగా పరిగణిస్తారు.

సర్పంచ్‌ విధులు, బాధ్యతలు

u గ్రామపంచాయతీ సమావేశాలు, గ్రామసభలకు సర్పంచ్‌ అధ్యక్షత వహిస్తారు. సర్పంచ్‌ అందుబాటులో లేకపోతే ఉపసర్పంచ్‌ అధ్యక్షత వహిస్తారు.

u గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామసభల తీర్మానాలతో జరిగే పనులను పర్యవేక్షించడం.

u రోజువారి కార్యాలయ నిర్వహణ, ప్రభుత్వం ఆమోదించిన మేరకు నిధులు ఖర్చు చేసే అధికారం సర్పంచ్‌కు ఉంటుంది.

u పంచాయతీ కార్యదర్శి కార్యకలాపాలపై సర్పంచ్‌కు పరిపాలనా పరమైన అధికారం ఉంటుంది.

u గ్రామ సర్పంచ్‌ గ్రామంలోని అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన నిధుల విడుదలకు చెక్‌ పవర్‌ కలిగి ఉంటాడు.

u గ్రామ పంచాయతీ సర్పంచ్‌కు ప్రభుత్వం ప్రతినెలా రూ. 6500 వేతనాన్ని అందిస్తుంది.

u ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికయ్యే సర్పంచ్‌పైన అవిశ్వాసం పెట్టే అధికారం సభ్యులకు ఉండదు.

సక్రమంగా నిర్వర్తించక పోతే

u గ్రామసభలు సకాలంలో నిర్వహించక పోవడం, ఆదాయ వ్యయాలపై ఆడిట్‌ చేయించక పోవడం, నిధుల దుర్వినియోగం జరిగినప్పుడు, అధికార దుర్వినియోగానికి పాల్పడినప్పుడు, పంచాయతీ నిర్వహణకు అవసరమైన ఉన్నతాధికారుల ఆదేశాలను పట్టించుకోని పక్షంలో సర్పంచ్‌లపై చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు ఉంటుంది.

u సర్పంచ్‌ ఏదైన కారణం చేత రాజీనామా చేయాల్సి వస్తే రాజీనామా పత్రాన్ని జిల్లా పంచాయతీ అధికారికి ఇచ్చి పదవిలోంచి దిగిపోవాల్సి ఉంటుంది.

u ఏదైన కారణంతో గ్రామ సర్పంచ్‌ పదవి ఖాళీ అయితే 120 రోజులలోపు ఎన్నిక నిర్వహించి తిరిగి కొత్త సర్పంచ్‌ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఉపసర్పంచ్‌ బాధ్యతలు నిర్వహిస్తాడు.

గ్రామ సర్వాధికారాలు పంచాయతీకే

విశేష అధికారాలు కల్పించిన

నూతన పంచాయతీరాజ్‌ చట్టం

ఊరికి సర్పంచే సుప్రీం1
1/1

ఊరికి సర్పంచే సుప్రీం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement