15 ఏళ్లు సర్పంచ్‌గా..
రాజాపేట : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బొందుగుల గ్రామానికి చెందిన సంఘం నారాయణరెడ్డి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొనడంతో పాటు గ్రామ సర్పంచ్‌గా 15ఏళ్ల పాటు పని చేశారు. 1957లో బొందుగుల గ్రామానికి మొదటి సర్పంచ్‌గా ప్రభుత్వం ఆయనను నామినేట్ చేసింది. ఆతరువాత జరిగిన ఎన్నికల్లో వరుసగా రెండు పర్యాయాలు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అనంతరం ఆయన తల్లి మాణిక్యమ్మ కూడా సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. తాను సర్పంచ్‌గా ఉన్న సమయంలో చెరువుల నిర్మాణం, సాగులో ఆధునిక పద్ధతులు ప్రవేశ పెట్టించారు. కలరా, మసూచి వంటి వ్యాధులతో పాటు పాము, తేలుకాటుకు తాను నేర్చుకున్న ఆయుర్వేద వైద్యంతో మందులు అందించారు. ఆయన ప్రజలతో మమేకమై ఉంటుండడంతో గ్రామ ప్రజలు ఆయనను సంఘం నారాయణరెడ్డికి బదులుగా బొందుగుల నారాయణరెడ్డిగా పిలిచేవారు. నారాయణరెడ్డి 1994లో మృతి చెందారు.
ఊట్కూరులో ‘నర్సింగ్’
కుటుంబానిదే హవా
నిడమనూరు : నిడమనూరు మండలం ఊట్కూరు గ్రామంలో రెండు దశాబ్దాలుగా నర్సింగ్ కృష్ణయ్య కుటుంబం నుంచే సర్పంచ్‌గా గెలుపొందుతున్నారు. నర్సింగ్ కృష్ణయ్య 2006లో, ఆయన భార్య సత్యమ్మ 2013లో వరుసగా రెండు పర్యాయాలు సర్పంచ్‌లుగా కొనసాగగా.. 2019లో వారి కుమారుడు నర్సింగ్ విజయ్‌కుమార్ సర్పంచ్‌గా గెలుపొందారు.
నాకు గెలుపు యోగ్యం ఉందా..!
● జ్యోతిష్యులను ఆశ్రయిస్తున్న సర్పంచ్ అభ్యర్థులు
హాలియా : పంతులూ.. ఎన్నికల బరిలో దిగితే గెలుస్తానా, నా జాతక చక్రం ఎలా ఉందంటూ నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని ఆయా గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచే ఆశావహులు పలువురు జ్యోతిష్యులు, పురోహితులను ఆశ్రయిస్తున్నారు. మాకు అనుకూలంగా రిజర్వేషన్ ఉంది, సర్పంచ్ కావాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది, పోటీ చేయాలనుకుంటున్నా.. ఇంతకు నా జాతకం బాగుందా..? నామినేషన్ ఎప్పుడు వేయాలి. పక్కాగా గెలుస్తానా అని ఆరా తీస్తున్నారు. ఫలానా పంతులు బాగా చెబుతాడు అంటే అక్కడికి వెళ్లి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కొంతమంది ఆశావహులు పురోహితులు, జ్యోతిషుల సూచన మేరకు పలు ఆలయాల్లో పూజలు, అభిషేకాలు చేయిస్తుండగా.. మరికొంత మంది ఆశావహులు తిధి, నక్షత్రం, ముహూర్త బలం చూసుకొని నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు.
15 ఏళ్లు సర్పంచ్‌గా..
15 ఏళ్లు సర్పంచ్‌గా..
15 ఏళ్లు సర్పంచ్‌గా..
15 ఏళ్లు సర్పంచ్‌గా..


