రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
నార్కట్‌పల్లి : నార్కట్‌పల్లి మండల కేంద్రంలోని నల్లగొండ చౌరస్తా వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్‌పల్లికి చెందిన గుంటూరు అభిరామ్(21) నల్లగొండ క్రాస్ రోడ్డు వద్ద పండ్లు కొనుక్కునేందుకు వెళ్లాడు. అదే సమయంలో నల్లగొండ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న డీసీఎంను డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడపడంతో అదుపుతప్పి అభిరామ్‌ను ఢీకొట్టి ఎదురుగా షాపులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అభిరామ్ మృతిచెందగా.. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక కామినేని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ క్రాంతికుమార్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను నియంత్రించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


