విద్యార్థులకు మానవీయ విలువలు నేర్పాలి
సూర్యాపేట టౌన్ : విద్యార్థులకు ఉపాధ్యాయులు మానవీయ విలువలు నేర్పించాలని అఖిల భారత విద్యావేదిక సభ్యుడు, ప్రొఫెసర్ జి. హరగోపాల్ అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, డీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ యోగానందచారి ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వృత్తి నిబద్ధతకు, సామాజిక బాధ్యతకు లోబడి ఉపాధ్యాయులు పనిచేస్తేనే మంచి సమాజం నిర్మాణమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాలమూరు అధ్యయన వేదిక ప్రతినిధి రాఘవాచారి, డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. సోమయ్య, కార్యదర్శి లింగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు పబ్బతి వెంకటేశ్వర్లు, అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకుడు ఎం. గంగాధర్, ప్రతినిధులు ఆర్. లింగయ్య, లక్ష్మణ్, సుదర్శన్, నాగయ్య, వేణు తదితరులు పాల్గొన్నారు.


