మూర్ఛతో పొలంలో పడి వ్యవసాయ కూలీ మృతి | - | Sakshi
Sakshi News home page

మూర్ఛతో పొలంలో పడి వ్యవసాయ కూలీ మృతి

Jul 4 2025 3:28 AM | Updated on Jul 4 2025 3:28 AM

మూర్ఛ

మూర్ఛతో పొలంలో పడి వ్యవసాయ కూలీ మృతి

చిట్యాల: వ్యవసాయ పొలంలో పనిచేస్తున్న కూ లీకి మూర్ఛ(ఫిట్స్‌) రావడంతో బురదలో కూరుకుపోయి ఊపిరిడాక మృతి చెందాడు. ఈ ఘటన చిట్యాల మండలం నేరడ గ్రామంలో గురువారం జరిగింది. ఎస్‌ఐ మామిడి రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నేరడ గ్రామానికి చెందిన వడ్డెపల్లి సైదులు(40) గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో కూలీ పనికి వెళ్లాడు. పొలంలో పనులు చేస్తుండగా ఒక్కసారిగా అతడికి మూర్ఛ రావడంతో పొలంలోని బురదలో పడిపోయాడు. ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో బురదలో ఊపిరిడాడక అక్కడికక్కడే మృతిచెందాడు. కొద్దిసేపటి తర్వాత పలువురు కూలీలు గుర్తించి పొలంలో నుంచి బయటకు తీసుకొచ్చారు. మృతుడికి భార్య, నలుగురు పిల్లలున్నారు. మృతుడి భార్య సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

చెల్లని చెక్కు కేసులో

ఆరు నెలలు జైలు శిక్ష

కోదాడరూరల్‌ : తీసుకున్న అప్పుకింద చెల్లని చెక్కు ఇచ్చిన వ్యక్తికి కోదాడ ప్రిన్సిపల్‌ జ్యూడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కె. భవ్య ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెలువరించారు. వివరాలు.. కోదాడ పట్టణా నికి చెందిన కొదుమూరి ప్రవీణ్‌ వద్ద రంగాపురపు ఉమామహేశ్వర్‌ రూ.5లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు కింద 2014లో ఉమామహేశ్వర్‌ ప్రవీణ్‌కు చెక్కు ఇచ్చాడు. ఆ చెక్కు బ్యాంకులో చెల్లకపోవడంతో ప్రవీణ్‌ కోర్టును ఆశ్రయించాడు. సుదీర్ఘకాల విచారణ అనంతరం కేసు తుది విచారణలో భాగంగా గురువారం ఉమామహేశ్వర్‌కు ఆరు నెలల జైలుశిక్షతో పాటు రూ.5లక్షల నగదు చెల్లించాలని జడ్జి తీర్పు వెలువరించారు.

విద్యుదాఘాతంతో

వ్యక్తి మృతి

పాలకవీడు: ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన పాలకవీడు మండలం మిగడంపహాడ్‌తండాలో గురువారం జరిగింది. తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిగడంపహాడ్‌తండాకు చెందిన సపావత్‌ బిచ్చా(45) ఎలక్ట్రీ షియన్‌గా పనిచేస్తున్నాడు. అదే తండాకు చెందిన ఓ రైతు వ్యవసాయ పొలం వద్ద బోరు మోటారుకు కరెంట్‌ సరఫరా కాకపోవడంతో గురువారం బిచ్చాను పిలిచాడు. బిచ్చా ట్రాన్స్‌ఫార్మర్‌ వద్దకు వెళ్లి చూడగా.. 11కేవీ విద్యుత్‌ తీగ తెగిపడి ఉండటం గమనించి మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య కస్తూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

వ్యభిచారం గృహంపై పోలీసుల దాడి

ఇద్దరు విటులు, ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

మిర్యాలగూడ టౌన్‌: మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామ శివారులోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు గురువారం దాడి చేసినట్లు మిర్యాలగూడ రూరల్‌ ఎస్‌ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపారు. గూడూరు గ్రామ శివారులో గల ఆర్టీఓ కార్యాలయం ఎదురుగా ఉన్న ఇంట్లో తనిఖీలు చేసి ఇద్దరు విటులతో పాటు మరో ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. వారి నుంచి నాలుగు సెల్‌ఫోన్లు, రూ.1000 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

మూర్ఛతో పొలంలో పడి వ్యవసాయ కూలీ మృతి1
1/1

మూర్ఛతో పొలంలో పడి వ్యవసాయ కూలీ మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement