
బైక్‌ను ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి
నాగార్జునసాగర్: బైక్‌ను లారీ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన నాగార్జునసాగర్‌కు సమీపంలోని పాత కంకరమిల్లు మూలమలుపు వద్ద సోమవారం జరిగింది. విజయపురి టౌన్ ఎస్‌ఐ ముత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం.. నాగార్జునసాగర్‌లోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో కరాటే నేర్పడానికి హాలియా నుంచి కరాటే మాస్టర్ కందుల రమేశ్(36), అతడి సమీప బంధువు పెదమాము మనోజ్‌కుమార్ బైక్‌పై వస్తున్నారు. నాగార్జునసాగర్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో పాత కంకరమిల్లు మూలమలుపు సమీపంలోకి రాగానే వెనుక నుంచి లారీ వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో రమేష్, మనోజ్‌కుమార్ ఎగిరి రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడిపోయారు. రమేశ్ తలకు బలమైన దెబ్బ తలగడంతో అక్కడికక్కడే మృతిచెందగా.. మనోజ్‌కుమార్ కాలు, చేయి విరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయాలపాలైన మనోజ్‌ను స్థానిక కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నల్ల గొండకు తీసుకెళ్లారు. రమేశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడు రమేష్ స్వస్థలం త్రిపురారం మండలం దుగ్గపల్లి కాగా, అతడికి భార్య మహేశ్వరి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. క్షతగాత్రుడు మనోజ్‌కుమార్ స్వస్థలం నిడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామం.
మరొకరికి గాయాలు