
ఆలయం, భక్తుల భద్రతకు ప్రాధాన్యం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం, భక్తుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని, అందుకోసం పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని ఆలయ ఈవో వెంకట్రావ్ ఆదేశించారు. ఆలయ భ్రదతపై ఆదివారం యాదగిరికొండపైన ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. భద్రతను కట్టుదిట్టం చేసే చర్యల్లో భాగంగా ఎస్‌పీఎఫ్, హోంగార్డులను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సెక్యూరిటీ, సీసీ కెమెరాల పనితీరును మెరుగుపర్చాలని ఆదేశించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సీసీ కెమెరాలను అదనంగా ఏర్పాటు చేయాలని సూచించారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా జూలైలో దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయ పరిధిలోని ఐదు ప్రాంతాల్లో మొక్కలు నాటనున్నట్లు వెల్ల డించారు. అందుకు అవసరమైన మొక్కలు సమకూర్చుకోవాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా వాహన పూజల స్థలాన్ని ఘాట్ రోడ్డు–2 సర్కిల్ పక్కన ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో డిప్యూటీ ఈఓ దోర్భల భాస్కర్‌శర్మ, ఆలయ అధికారులు దయాకర్‌రెడ్డి, నవీన్‌కుమార్, జే.కృష్ణ, గజివెల్లి రమేష్‌బాబు, శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆలయ ఈఓ వెంకట్రావ్