సరిపోని మెస్ చార్జీలు
కాస్మోటిక్స్ సాయం.. దూరం
జిల్లాలో వసతి గృహాలు
భీమవరం (ప్రకాశం చౌక్) : జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. హాస్టళ్లలో సరైన వసతులు లేక విద్యా ర్థులు నానా అవస్థలు పడుతున్నారు. చంద్రబాబు సర్కారు విద్యార్థుల సంక్షేమాన్ని పట్టించుకోకపోవడంతో హాస్టళ్ల నిర్వహణ ఘోరంగా మారింది. తాగునీరు నుంచి టాయిలెట్ల వరకూ అన్నీ సమస్యలే ఉన్నాయి. జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో బాలురు, బాలిక హాస్టళ్లు ఉన్నాయి. వాటిలో 3 తరగతి నుంచి పీజీ వరకు విద్యార్థులకు వసతి కల్పిస్తున్నారు. మొత్తంగా 65 హాస్టళ్లు ఉండగా 3,119 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఒకప్పుడు ప్రభుత్వ హాస్టల్‌లో ప్రవేశం లభిస్తే అదృష్టంగా భావించేవారు. అయితే నేడు ప్రభుత్వ హాస్టల్ అంటే అయ్య.. బాబోయ్ అనే పరిస్థితులు నెలకొన్నాయి.
సౌకర్యాల లేమి
జిల్లాలోని 65 హాస్టళ్లలో పూర్తిస్థాయిలో సౌకర్యాలు ఒక్కచోట కూడా లేవు. తాగునీరు, వాడకం నీరు కొరత, అధ్వానంగా టాయిలెట్లు, నేలపైనే నిద్ర, భోజనం, పనిచేయని ఫ్యాన్లు, అరకొర లైటింగ్‌తో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. విద్యార్థులు నిద్రించేందుకు మంచాలు కాదు కదా కనీసం బెడ్లు కూడా పూర్తిస్థాయిలో లేవు. దీనికితోడు అపరిశుభ్ర వాతావరణంతో దోమలు బెడద, దుర్వాసనలతో విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు.
అద్దె భవనాల్లో..
జిల్లాలో 32 హాస్టళ్లకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. మిగిలిన వాటిలో దాదాపు 80 శాతం భవనాలు అధ్వానంగా ఉన్నాయి. మరమ్మతులకు నోచుకోక, రంగులు లేని చీకటి వాతావరణంలో ఉన్నాయి. దీంతో అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. అయితే నెలకు రూ.10 వేల నుంచి రూ.71 వేల వరకు అద్దె చెల్లిస్తున్నా ఆయా భవనాల్లోనూ పలు సమస్యలు ఉన్నాయి. దీనిపై భవన యజమానులను బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులకు ప్రశ్నించని పరిస్థితి.
కలుషిత నీటితో విద్యార్ధులకు చర్మ వ్యాధులు (ఫైల్)
పాలకొల్లులో బీసీ హాస్టల్‌లో డోర్ లేని టాయిలెట్స్
నిత్యావసరాల సరుకులు, కూరగాయల ధరల పెరుగుతుండగా విద్యార్థులకు ఇచ్చే మెస్ చార్జీ (రూ.53)లు పెంచడం లేదు. దీంతో హాస్టళ్లలో విద్యార్థులకు మెనూలో కోత పెడుతున్నారు. రెండు కూరలకు బదులు ఒక కూరతో సరిపెట్టడం, కోడిగుడ్డు నిలిపివేయడం, ఉదయం అల్పాహారం నిలిపివేయడం వంటివి కొన్ని చోట్ల జరుగుతున్నాయి. ఇలా విద్యార్థులకు సంతృప్తికరంగా భోజనం కూడా పెట్టలేని దుస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హాస్టల్ విద్యార్థులకు ఆయా తరగతులను బట్టి నెలకు రూ.170 నుంచి రూ.250 వరకు కాస్మోటిక్స్ సాయం అందిస్తారు. సబ్బులు, కొబ్బరి నూనె, పౌడర్లు, టూత్‌పేస్ట్, బ్రేష్‌లు తదితర వాటి కోసం ఈ మొత్తం ఇస్తుంటారు. అయితే చంద్రబాబు ప్రభుత్వంలో గత మే నెల నుంచి కాస్మోటిక్స్ సాయం విద్యార్థులకు అందించలేదు. ఇలా జిల్లాలో ఒక్కో విద్యార్థికి రూ.1,000 నుంచి రూ.1,500 వరకు సుమారు రూ.40 లక్షల బకాయిలు చెల్లించాల్సి ఉంది.
బీసీ బాలుర హాస్టళ్లు 16
బీసీ బాలికల హాస్టళ్లు 13
విద్యార్థులు 1,530 మంది
ఎస్సీ బాలుర హాస్టళ్లు 15
ఎస్సీ బాలికల హాస్టళ్లు 20
విద్యార్థులు 1,529 మంది
ఎస్టీ హాస్టల్ 1
విద్యార్థులు 60 మంది
సమస్యలతో సతమతం
హాస్టళ్లలో అరకొర వసతులు
వేధిస్తున్న సౌకర్యాల కొరత
విద్యార్థులకు అందని కాస్మోటిక్స్ సాయం
నేలపైనే నిద్ర, భోజనం
సంక్షేమం పట్టని చంద్రబాబు సర్కారు
భీమవరంలో మూడు బాలుర, ఒక ఎస్సీ బాలిక, ఒక బీసీ బాలిక హాస్టళ్లు ఉన్నాయి. మూడు బాలుర హాస్టళ్లు అద్దె భవనంలో నడుస్తున్నాయి. బీసీ కళాశాల స్థాయి హాస్టల్‌లో బెడ్‌లు లేక విద్యార్థులు నేలపై నిద్రిస్తున్నారు. భవనాలకు మరమ్మతులు లేవు. గదుల్లో సరైన వెలుతురు లేదు. బీసీ హాస్టల్–1 భవనంలో విద్యార్థులు భోజనం చేయడానికి భవనం పైకి వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ వేసిన ఇనుప మెట్లు ప్రమాదకరంగా ఉన్నాయి. అలాగే భవనం అధ్వానంగా ఉంది. నర్సయ్య అగ్రహారంలోని బీసీ హాస్టల్ భవనం రంగులు లేక అధ్వానంగా ఉంది. వీరవాసరం మండంలో నాలుగు హాస్టళ్లలో పారిశుద్ధ్యం క్షీణించింది. నేలపై భోజనం చేయడానికి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
నరసాపురంలో 12 హాస్టళ్లకు 8 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. హాస్టళ్లలో కనీసం సౌకర్యాల కొరత ఉంది.
పాలకొల్లులోని బీసీ హాస్టల్‌లో టాయిలెట్స్ అధ్వానంగా ఉన్నాయి. తాగునీరు, వాడకం నీటి సమస్యలు ఉన్నాయి. కలుషిత నీటి వల్ల విద్యార్థులు దురదలు వంటి సమస్యలు ఎదుర్కొన్నారు. మెస్ చార్జీలు చాలక విద్యార్థులకు సరిపడా ఆహారం పెట్టడం లేదు.
తణుకు నియోజకవర్గంలో తణుకు, అత్తిలి హాస్టళ్లలో సౌకర్యాల కొరత ఉంది.
ఆచంట నియోజవర్గంలోని పొలమూరు ఎస్సీ బాలురు హాస్టల్‌లో సౌకర్యాల కొరత వేధిస్తోంది. తాగునీటి సౌకర్యం లేకపోవడంతో బయట నుంచి తెచ్చుకుంటున్నారు. నేలపైనే భోజనాలు, నిద్రతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ రూ.14 లక్షల నిధులతో చేపట్టిన పనులు సక్రమంగా జరగడం లేదనే ఆరోపణ ఉంది.
తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పెంటపా డు మండలం పరిమెళ్లలో ఎస్సీ బాలుర హాస్టల్‌తోపాటు పెంటపాడులో బాలబాలికల హాస్టల్ ఉంది. ప్రధానంగా వాటిలో టాయిలెట్ల సమస్య ఉంది. పెంటపాడు హాస్టల్‌కు దారి సమస్య ఉంది. తాడేపల్లిగూడెంలో పట్టణంలోని యాగర్లప ల్లి, కడకట్ల ప్రాంతాల్లో బీసీ హాస్టల్ భవనాలు ని రుపయోగంగా ఉన్నాయి.
సంక్షోభ వసతి గృహాలు
సంక్షోభ వసతి గృహాలు
సంక్షోభ వసతి గృహాలు
సంక్షోభ వసతి గృహాలు


