రసవత్తరంగా నాటిక పోటీలు
వీరవాసరం: తోలేరులో సుబ్రహ్మణ్యేశ్వర కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 21వ జా తీయ స్థాయి నాటికల పోటీలు ఆదివారం రసవత్తరంగా సాగాయి. అమరావతి ఆర్ట్స్ (గుంటూరు) వారి చిగురు మేఘం నాటిక మొదటి ప్రదర్శనగా సాగింది. రచన కావూరు సత్యనారాయణ దర్శకత్వం ఏపూరి హరిబాబు వహించారు. గోవాడ ఆర్ట్స్ క్రియేషన్స్ (హైదరాబాద్) వారి అమ్మ చిక్కిన బొమ్మ నాటిక ద్వితీయ ప్ర దర్శనగా సాగింది. రచన శ్రీ జ్యోతిరాజ్ బీశెట్టి, దర్శకత్వం డాక్టర్ గోవాడ వెంకట వహించారు. ఏర్పాట్లను నిర్వాహకులు చావాకుల సత్యనారాయణ పర్యవేక్షించారు.
నరసాపురం రూరల్ : దిత్వా తుపాను ప్రభావంతో నరసాపురం, మొగల్తూరు మండలాల్లో ని తీర ప్రాంత గ్రామాల్లో ఆదివారం మ ధ్యాహ్నం నుంచి చిరుజల్లులు కురిశాయి. తుపాను హెచ్చరికల నేపథ్యంలో పేరుపాలెం సౌత్, కేపీ పాలెం సౌత్ గ్రామాల్లో బీచ్‌ల్లోకి సందర్శకులను అనుమతించలేదు. సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఎస్సై జి.వాసు పర్యవేక్షణలో సిబ్బంది బారికేడ్లు ఏ ర్పాటుచేసి సముద్ర స్నానాలను నిషేధించారు. ఇదిలా ఉండగా మండలంలో కోతలు కోసిన ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకునేందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు. వర్షం పెరిగితే వరి పంటకు నష్టం తప్పదని ఆవేదన చెందుతున్నారు.
ఉండి/ఆకివీడు: ఉండి రైల్వేగేటును రైల్వే ఓవ ర్ బ్రిడ్జి పనుల నిమిత్తం సోమవారం నుంచి 20వ తేదీ వరకూ మూసివేయనున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. అయితే ప్రత్యామ్నాయ మార్గాల విషయంలో ప్రయాణికులు ఆందోళ న చెందుతున్నారు. గేటు మూసివేతతో భీమ వరం నుంచి ఆకివీడు మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారికి ఇబ్బందులు తప్పవు. ఉండి నుంచి ఆకివీడు వెళ్లేందుకు ఉండి బస్టాండ్‌కు ముందు బొండాడ మేజర్ డ్రెయిన్‌ను ఆనుకుని ఉన్న వాండ్రం ఆర్‌అండ్‌బీ రోడ్డుపై ప్రయాణించి వాండ్రం పెదపుల్లేరు చేరుకుని అక్కడ నుంచి ఉండి రోడ్డుకు చేరుకోవచ్చు. అయితే భారీ వాహనాలు వెళ్లలేవు. అలాగే ఉండి సెంటర్ నుంచి గణపవరం రోడ్డులో పాములపర్రు చే రుకుని అక్కడ నుంచి పెదకాపవరం రోడ్డు మీ దుగా ఆకివీడు వెళ్లవచ్చు. ఇటుగా భారీ వాహనాలు వెళ్లే అవకాశం ఉన్నా రోడ్డు అధ్వానంగా ఉంది. ప్రస్తుతం మాసూళ్లు ముమ్మరంగా సా గుతున్న క్రమంలో ఉండి, గణపవరం మండలాల రైతులు ధాన్యాన్ని ఆకివీడులోని మిల్లులకు తరలించేందుకు ఇబ్బందులు తప్పని పరిస్థితి. గేటు మూసివేత నిర్ణయంపై పునరాలోచించాలని రైతులు కోరుతున్నారు.
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో ఆన్‌లైన్ సేవలు విస్తృతం కా నున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయా ల అధికారులతో ఈనెల 29న ఉన్నతాధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆలయాల్లో ఆన్‌లైన్, డిజిటల్ సేవలను విస్తృతపరిచే అంశాలపై చర్చించారు. ఆన్‌లైన్ ద్వారా దర్శనం టికెట్లు పొందిన భక్తులకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా దర్శనం ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే ఆన్‌లైన్ ద్వారా ప్రసా దాలు కొనుగోలు చేసేవారికి ప్రత్యేక కౌంటర్ ద్వారా త్వరితగతిన వాటిని అందించే ఏర్పాట్లు చేయాలన్నారు. భద్రతలో భాగంగా ఆలయాల్లోకి సెల్‌ఫోన్లను అనుమతించవద్దన్నారు. పా రిశుద్ధ్యం, ఇతర సౌకర్యాల కల్పనలో చినవెంకన్న దేవస్థానం 3వ స్థానంలో ఉందని, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని సూచించారు. ఆన్‌లైన్ సేవలపై అవగాహన పెంచాలన్నారు.
సేవలు సులభతరం
స్వామివారి దర్శనం, వసతి, డొనేషన్లు, కేశఖండన, ప్రసాదాలు, ఇతర సేవా టికెట్ల బుకింగ్ కోసం ఆన్‌లైన్ (వెబ్‌సైట్), వాట్సాప్ సేవలను వినియోగించుకోవాలని ఆలయ ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి సూచించారు. httpr:// www. aptemples.org వెబ్‌సైట్ ద్వారా, మన మిత్ర వాట్సాప్ +919552300009 ద్వారా సులభంగా సేవలు పొందవచ్చన్నారు.
రసవత్తరంగా నాటిక పోటీలు
రసవత్తరంగా నాటిక పోటీలు


