
డీఎస్సీ పరీక్షలకు 94 శాతం హాజరు
భీమవరం: జిల్లాలోని రెండు కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన మెగా డీఎస్సీ పరీక్షకు 94 శాతం అభ్యర్థులు హాజరయ్యారని డీఈఓ ఈ.నారాయణ తెలిపారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 210 మందికి 199 మంది హాజరయ్యారన్నారు. ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని చెప్పారు.
ఏలూరు జిల్లాలో 455 మంది హాజరు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరులో ఆదివారం జరిగిన డీఎస్సీ పరీక్షలకు 455 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం 100 మందికి 83 మంది, మ ధ్యాహ్నం 101 మందికి 94 మంది హాజర య్యారు. సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉ దయం 115 మందికి 95 మంది, మధ్యాహ్నం 201 మందికి 183 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు.