
ముస్లింల ద్రోహి చంద్రబాబు
ఆకివీడు: ముస్లింల ద్రోహి ముఖ్యమంత్రి చంద్రబాబు అని వైఎస్సార్‌సీపీ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ జహంగీర్ అ న్నారు. కేంద్రంలో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదంలో కూటమి ప్రభుత్వం అనుసరించిన తీరుపై గురువా రం ఆయన మండిపడ్డారు. సవరణ చట్టం లౌకిక వాదానికి చెంపపెట్టు అన్నారు. మత ద్వేషాల్ని రె చ్చగొట్టేలా, ముస్లింల వక్ఫ్ ఆస్తుల్ని స్వాధీన పర చుకునేలా కేంద్రం పన్నిన కుట్రకు చంద్రబాబు వత్తాసు పలికారని విమర్శించారు. వక్ఫ్ సవరణ చ ట్టం ఆమోదంతో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఉరి వేసుకున్నట్లేనని జహంగీర్ అన్నారు. అధికా రం కోసం ఎన్నికల్లో ముస్లింలకు అండగా ఉంటానని చెప్పి చంద్రబాబు పీఠం ఎక్కిన తర్వాత వారిని విస్మరించారన్నారు. వక్ఫ్ చట్టాన్ని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యతిరేకించారని అన్నారు. దివంగత వైఎస్సార్ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారని, ముస్లింలకు అండగా నిలిచింది ఎవరనేది మైనార్టీలు గుర్తించాల న్నారు. ముస్లిం సమాజానికి జరుగుతున్న అన్యా యాన్ని గుర్తించి పోరాడాలని పిలుపునిచ్చారు.