వరంగల్
న్యూస్‌రీల్
జీపీలు..
3172,754
● జిల్లాలో 15 ఇంటర్ వృత్తివిద్య కళాశాలలు
● శిక్షణ పొందుతున్న విద్యార్థులు
త్వరలో పార్ట్‌టైం లెక్చరర్ల నియామకం
కాకతీయ యూనివర్సిటీలో త్వరలోనే పార్ట్‌టైం లెక్చరర్ల నియామకం చేపట్టనున్నారు. రెండు వారాల్లో నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.
సోమవారం శ్రీ 1 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
సీఎం పర్యటనను
విజయవంతం చేయాలి
నర్సంపేట: నర్సంపేటలో డిసెంబర్ 5న నిర్వహించే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం నర్సంపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల ముఖ్య నాయకులతో ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని మండలాల నాయకులకు పంచాయతీ ఎన్నికలపై దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, వార్డు సభ్యుల గెలుపు కోసం ప్రతీ కార్యకర్త కృషి చేయాలన్నారు.
ప్రజావాణి రద్దు
న్యూశాయంపేట: గ్రామపంచాయతీ ఎన్నికల కారణంగా వరంగల్ కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా అధికారులు ఎన్నికల నిర్వహణలో ఉన్నందున సర్పంచ్ ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.
మద్యం పట్టివేత
సంగెం: మండలంలోని మొండ్రాయిలో అనుమతి లేని మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం నమ్మదగిన సమాచారం మేరకు గ్రామంలోని గుర్రం సాంబయ్య బెల్టుషాపులో అక్రమంగా విక్రయిస్తున్న రూ.7,690 విలువగల మద్యాన్ని పట్టుకున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. మద్యం సీజ్ చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.
అలరించిన
కార్తీక నృత్యోత్సవం
హన్మకొండ: హనుమకొండ గోకుల్‌నగర్‌లోని అంబేడ్కర్ భవన్‌లో ఆదివారం నిర్వహించిన కార్తీక నృత్యోత్సవం అలరించింది. శ్రీభారతి కళాక్షేత్రం కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో కార్తీక సంగీత, నృత్య, వాయిద్యాల ఉత్సవం–25 నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 90 మంది కూచిపూడి నృత్య కళాకారులు, 60 మంది కర్ణాటక సంగీత కళాకారులు, ఇద్దరు వీణా, ఐదుగురు వయోలిన్, ఇద్దరు ఫ్లూట్ కళాకారులు పాల్గొని అత్యుత్తమ ప్రదర్శనతో ప్రతిభ చాటారు. ఈసందర్భంగా శ్రీభారతి కళాక్షేత్రం కల్చరల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు బొల్లం మాధవి మాట్లాడుతూ.. కళలపై అభిరుచిని పెంపొందించేందుకు, కళలను ప్రోత్సహించేందుకు ఇలాంటి పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి పోటీల నిర్వహణతో కళాకారుల్లో పోటీతత్వం పెరుగుతుందని, కళల్లో రాణించేందుకు సాధన చేస్తారన్నారు. కార్యక్రమంలో ఆర్గనైజర్ బొల్లం రవి, వ్యాఖ్యాత ఉమ్మడి లక్ష్మణాచార్యులు, కళాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
153 ఓట్లు సాధిస్తే సర్పంచ్
సంగెం: మండలంలోని ముమ్మడివరం గ్రామంలో 153 ఓట్లు సాధించిన అభ్యర్థి సర్పంచ్‌గా ఎన్నికకానున్నారు. 2018 ఆగస్టులో నార్లవాయి గ్రామపంచాయతీ నుంచి ముమ్మడివరం ప్రత్యేక జీపీగా ఏర్పడింది. రెవెన్యూ గ్రామంగా ఉన్న ముమ్మడివరంలో 305 మంది ఓటర్లు ఉండగా వీరిలో 146 మంది పురుషులు, 159 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 153 ఓట్లు వస్తే సర్పంచ్‌గా ఎన్నికవుతారు. ఆరు వార్డులుండగా ఒక్కో వార్డులో 26 ఓట్లు సాధిస్తే వార్డు సభ్యుడిగా ఎన్నికవుతారు. ముమ్మడివరం సర్పంచ్ స్థానం జనరల్‌కు కేటాయించారు. ఔత్సాహికులు పోటీపడి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
వార్డులు
వరంగల్: జిల్లాలో మూడు విడతలుగా 11 మండలాల్లోని 317 గ్రామ పంచాయతీలకు జరిగే ఎన్నికల్లో 3,83,738 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగంచుకోనున్నారు. పంచాయతీల్లో ప్రతి వార్డుకు ఒక పోలింగ్ స్టేషన్ చొప్పున జిల్లాలోని 2,754 వార్డుల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈఎన్నికల్లో మొదటి విడత పర్వతగిరి, రాయపర్తి, వర్ధన్నపేట మండలాల్లోని 91 పంచాయతీల్లో 800 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తుండగా అందులో 1,15,882 మంది, రెండో విడత దుగ్గొండి, గీసుకొండ, నల్లబెల్లి, సంగెం మండలాల్లోని 117 పంచాయతీల్లో 1008 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తుండగా అందులో 1,39,100 మంది ఓటర్లు, మూడో విడత ఖానాపురం, చెన్నారావుపేట, నర్సంపేట, నెక్కొండ మండలాల్లోని 109 పంచాయతీల్లో 946 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తుండగా అందులో 1,28,756 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జిల్లాలో మొత్తం 317 గ్రామ పంచాయతీల్లో 206 సాధారణ, 89 సమస్యాత్మక, 22 అత్యంత సమస్మాత్మక పంచాయతీలుగా అధికారులు గుర్తించారు. ఈపంచాయతీల్లో అదనపు సిబ్బందితోపాటు అదనపు భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.
స్కూృటిని అనంతరం..
మొదటి విడత 91 గ్రామ పంచాయతీలోని సర్పంచ్ స్థానాలకు జరిగే ఎన్నికల్లో 665 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఆదివారం స్కూృటిని అనంతరం 614 నామినేషన్లు అర్హత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. వర్ధన్నపేట మండంలోని 18 జీపీలకు 129 నామినేషన్లు దాఖలు కాగా 108 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. పర్వతగిరి మండలంలో 33 జీపీలకు 258 నామినేషన్లు దాఖలు చేయగా 257 నామినేషన్లు సరిగా ఉన్నట్లు తెలిపారు. రాయపర్తి మండలంలో 40 సర్పంచ్ స్థానాలకు 278 నామినేషన్లు దాఖలు కాగా 249 అర్హత సాధించినట్లు తెలిపారు. అదే విధంగా వర్ధన్నపేట మండలంలో 170 వార్డులకు 397 నామినేషన్లు దాఖలు కాగా.. 386, పర్వతగిరి మండలంలో 288 వార్డు స్థానాలకు 287 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాలకు 742 నామినేషన్లు దాఖలు కాగా.. 728 అర్హత సాధించాయి. రాయపర్తి మండలంలో 342 వార్డు స్థానాలకు 726 నామినేషన్లు దాఖలు కాగా 690 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు తెలిపారు.
రెండో విడత నామినేషన్ల స్వీకరణ
జిల్లాలో రెండో విడత నామినేషన్ల స్వీకరణ ఆది వారం ప్రారంభమైంది. మొదటి విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శనివారం ముగిసింది. రెండో విడతలో భాగంగా 30 (నే టి నుంచి) డిసెంబర్ 2వ తేది వరకు నర్సంపేట రెవె న్యూ డివిజన్‌లోని దుగ్గొండి, నల్లబెల్లి మండలాల్లో, వరంగల్ రెవెన్యూ డివిజన్‌లోని సంగెం, గీసుగొండ మండలాల పరిధిలోని 117 సర్పంచ్ స్థానాలకు, 1008 వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తారు. మొదటి రోజైన ఆదివారం సర్పంచ్ స్థానాలకు 32, వార్డు సభ్యుల స్థానాలకు 24నామినేషన్లు దాఖలు అ య్యాయి. దుగ్గొండి మండలంలో 34సర్పంచ్ స్థానా ల్లో 7, 282 వార్డు సభ్యుల స్థానాల్లో 3 నామినేషన్లు, నల్లబెల్లి మండలంలోని 29 సర్పంచ్ స్థానాల్లో 6 నామి నేషన్లు, 252 వార్డు సభ్యుల స్థానాల్లో 3, గీసుకొండ మండలంలోని 21 సర్పంచ్ స్థానాల్లో 7 నామినేషన్లు, 188 వార్డు సభ్యుల స్థానాల్లో 3నామినేషన్లు, సంగెం మండలంలోని 33సర్పంచ్ స్థానాల్లో 12 నామినేషన్లు, 286 వార్డు సభ్యుల స్థానాలకు 15 నామినేషన్లు దాఖలు అయ్యాయి.
ఓటు హక్కు వినియోగించుకోనున్న 3,83,738 మంది ఓటర్లు
మొదటి విడత 91 పంచాయతీల్లో
నామినేషన్లు పూర్తి
జిల్లాలో 206 సాధారణ పంచాయతీలు
సమస్యాత్మక పంచాయతీలు 89
అత్యంత సమస్మాత్మక పంచాయతీలు 22
జిల్లాలో జీపీలు, వార్డులు, పోలింగ్ కేంద్రాల వివరాలు
ఫేజ్ –1
డివిజన్ మండలం జీపీలు వార్డులు పోలింగ్ ఓటర్లు
కేంద్రాలు
వరంగల్ పర్వతగిరి 33 288 288 39.934
వరంగల్ వర్ధన్నపేట 18 170 170 29.491
వరంగల్ రాయపర్తి 40 342 342 46.457
ఫేజ్ – 2
నర్సంపేట దుగ్గొండి 34 282 282 37.067
వరంగల్ గీసుకొండ 21 188 188 28.908
నర్సంపేట నల్లబెల్లి 29 252 252 31.664
వరంగల్ సంగెం 33 286 286 41.461
ఫేజ్ – 3
నర్సంపేట ఖానాపురం 21 184 184 27.978
నర్సంపేట చెన్నారావుపేట 30 258 258 31.872
నర్సంపేట నర్సంపేట 19 164 164 22.472
నర్సంపేట నెక్కొండ 39 340 340 46.434
ముగిసిన మొదటి విడత నామినేషన్ల ఘట్టం
జిల్లాలో మొదటి విడత నామినేషన్ల ఘట్టం శనివారంతో ముగిసింది. మొదటి విడతలో పర్వతగిరి, రాయపర్తి, వర్ధన్నపేట మండలాల్లోని 91 గ్రామ పంచాయతీలు, 800 వార్డు స్థానాలకు అధికారులు మూడు రోజులుగా నామినేషన్లు స్వీకరించారు. సర్పంచ్ స్థానాలకు మొదటి, రెండో రోజుల్లో 204 నామినేషన్లు రాగా.. చివరి మూడో రోజు అభ్యర్థులు శనివారం రాత్రి వరకు పోటీ పడి 461 నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో మొత్తం మూడు మండలాల్లోని 91 సర్పంచ్ స్థానాలకు 665 నామినేషన్లు అందినట్లు అధికారులు వెల్లడించారు. వార్డు సభ్యుల స్థానాలకు మొదటి రోజు, రెండో రోజు కలిపి 202 నామినేషన్లు రాగా చివరి రోజున 1,865 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు.
వరంగల్
వరంగల్
వరంగల్


