ఒకేషనల్ కోర్సులతో ఉద్యోగావకాశాలు
కాళోజీ సెంటర్: విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ఇంటర్‌లో ఒకేషనల్ కో ర్సులు (వృత్తి,ఽ ఆధారిత) ప్రవేశపెట్టి తరగతులు ని ర్వహిస్తోంది. ఇంటర్‌లో తరగతి గది పాఠాలతో పాటు వృత్తి ఆధారిత నైపుణ్యం పెంచేందుకు శిక్షణ ఇస్తోంది. నర్సింగ్, కంప్యూటర్ కోచింంగ్, కమర్షి యల్ గార్మెంట్స్ మేకింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషి యన్, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ తదితరులు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఒకేషనల్ కోర్సు ద్వారా ఆన్ జాబ్ ట్రైనింగ్ రెండు నెలలపాటు గు ర్తింపు పొందిన సంస్థల్లో ఉచితంగా అందిస్తున్నారు. దీని ద్వారా వృత్తినైపుణ్యాన్ని పొందొచ్చు. ఆన్ జాబ్ ట్రైనింగ్ (ఓజీటీ) ద్వారా ప్రథమ సంవత్సరంలో 100 మార్కులు, ద్వితీయ సంవత్సరంలో 100 మార్కులు విద్యార్థులకు కేటాయిస్తున్నారు. విద్యార్థుల క్రమశిక్షణ, సమయపాలన, ఉద్యోగ నైపుణ్యాలు, రికార్డులు తదితర అంశాల ఆధారంగా మార్కులు ఆయా సంస్థలు కేటాయిస్తున్నాయి. జిల్లాలో 15 ఇంటర్మీడియట్ ఒకేషనల్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో 775 మంది విద్యార్థులు ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లు పొందారు. నర్సంపేట విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఎలక్ట్రికల్ టెక్నీషియన్ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. అలాగే నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కోర్సు విద్యార్థులకు హనుమకొండలోని రోహిణి ఆస్పత్రి, నర్సింగ్ కాలేజీ, నర్సంపేటలోని అమ్మ నర్సింగ్ హోం, జనని ఆస్పత్రిలో శిక్షణ ఇస్తున్నారు. కంప్యూటర్ కోర్సు విద్యార్థులకు వరంగల్‌లోని సత్యం కంప్యూటర్ శిక్షణ కేంద్రం, కమర్షియల్ గార్మెంట్స్ మేకింగ్ కోర్సు విద్యార్థులకు వరంగల్‌లోని ధారా గార్మెంట్స్‌లో శిక్షణ ఇస్తున్నారు.
ఓజీటీతో ఉపాధికి
మార్గం సుగమం
ఇంటర్మీ డియట్ ఒకేషనల్ కళాశాలల్లో నిర్వహించే ఒకేషనల్ కోర్సుల ఆన్ జాబ్ ట్రైనింగ్ (ఓజీటీ) ఉపాధికి ఊతం కల్పిస్తుంది. రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా ఆన్ జాబ్ ట్రైనింగ్ చేస్తున్నారు. భవిష్యత్‌లో ఉపాధి అవకాశాలు పొందేలా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ కేంద్రాలను తనిఖీ చేసి విద్యార్థుల శిక్షణ పరిశీలిస్తున్నాం.
– డాక్టర్ శ్రీధర్ సుమన్, ఇంటర్ విద్యాశాఖ జిల్లా అధికారి
జిల్లాలో ఒకేషనల్ కళాశాలల వివరాలు
కళాశాల మొదటి
సంవత్సరం విద్యార్థులు
జీజేసీ కృష్ణకాలనీ వరంగల్ 49
పీవీ ఆంధ్రబాలిక జూనియర్ కళాశాల వరంగల్ 38
ఎంజీఎం ఒకేషనల్ జూనియర్ కళాశాల వరంగల్ 66
ప్రభుత్వ జూనియర్ కళాశాల నర్సంపేట 104
కేజీబీవీ నల్లబెల్లి 22
కేజీబీవీ దుగ్గొండి 18
కేజీబీవీ చెన్నారావుపేట 34
భద్రకాళి జూనియర్ కళాశాల నర్సంపేట 51
ఎస్‌ఆర్ ఒకేషనల్ జూనియర్ కళాశాల నర్సంపేట 182
శ్రీవికాస్ జూనియర్ కళాశాల నెక్కొండ 72
టీఎస్‌ఎస్‌డబ్ల్యూఆర్ జూనియర్ కళాశాల రాయపర్తి 24
కేజీబీవీ గీసుకొండ 35
కేజీబీవీ సంగెం 18
ఆర్‌డీఎఫ్ వనిత జూనియర్ కళాశాల పర్వతగిరి 45
కేజీబీవీ పర్వతగిరి 17
ఒకేషనల్ కోర్సులతో ఉద్యోగావకాశాలు
ఒకేషనల్ కోర్సులతో ఉద్యోగావకాశాలు


