నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా కొనసాగించాలి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
● జిల్లాలోని పలు క్లస్టర్లలో పరిశీలన
నల్లబెల్లి/వర్ధన్నపేట/సంగెం : గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పారదర్శకంగా కొనసాగించాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. మండలంలోని నారక్కపేట, రుద్రగూడెం, వర్ధన్నపేట మండలంలోని ఉప్పరపల్లి, కట్య్రాల,ఇల్లంద, ల్యాబర్తి, సంగెం మండలంలోని నల్లబెల్లి, ఎల్గూర్‌రంగంపేట క్లస్టర్లలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఆదివారం కలెక్టర్ పరిశీలించారు. కేంద్రాల వద్ద ప్రజల రద్దీని నియంత్రించేందుకు అదనపు సిబ్బంది సేవలను వినియోగించాలని తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, నర్సంపేట ఆర్డీఓలు ఉమారాణి, సుమ, తహసీల్దార్లు కృష్ణ, విజయసాగర్, రాజ్‌కుమార్, ఎంపీడీఓలు శుభానివాస్, వెంకటరమణ, రవీందర్, సంగెం మండల ప్రత్యేకాధికారి రమేష్, తదితరులు పాల్గొన్నారు.


