కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం
● పార్టీ బలపరిచిన అభ్యర్థులను
గెలిపించాలి
● నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నర్సంపేట రూరల్ : కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యమని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. చెన్నారావుపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటుచేసిన మండల స్థాయి సర్పంచ్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల ఎంపికను గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు కలిసి చర్చించి ఖరారు చేయాలన్నారు. ఎక్కువ మంది పోటీదారులు ఉంటే గ్రామాభివృద్ధి సామర్థ్యం, ప్రజల ఆశీస్సులు, రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకుని ఉత్తమ అభ్యర్థిని ఎంపిక చేసి గెలిపించేందుకు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. డిసెంబర్ 5న సీఎం రేవంత్‌రెడ్డి నర్సంపేట పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. నర్సంపేట– వరంగల్ ఫోర్‌లైన్ రోడ్డు, మెడికల్ కాలేజీ భవనం, ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణాలకు శంకుస్థాపన, దుగ్గొండి మండలం తొగర్రాయి ఆర్ అండ్ బీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన, పాకాల చెరువు ఆయకట్టు మరమ్మతు, కాల్వల నిర్మాణం, తదితర అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని తెలిపారు.
మెజార్టీ సర్పంచ్‌ల గెలుపే లక్ష్యమవ్వాలి
నెక్కొండ: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన మెజార్టీ సర్పంచ్‌ల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని వాసవి కల్యాణ మండపంలో ఆదివారం ఏర్పాటు చేసిన మండల స్థాయి కార్యకర్తల సన్నహక సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రతిపక్షాలకు గుణపాఠం చెప్పేలా ప్రజల తీర్పు ఉండేలా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని తెలిపారు. ఆయా సమావేశాల్లో టీపీసీసీ సభ్యుడు పెండెం రామానంద్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు బొంపెల్లి దేవేందర్‌రావు, డాక్టర్ పులి అనిల్‌కుమార్, మాజీ కౌన్సిలర్లు వేముల సాంబయ్య, చింతల సాంబరెడ్డి, మండల అధ్యక్షుడు రమేష్, మాజీ అధ్యక్షుడు భూక్య గోపాల్‌నాయక్, మాజీ ఎంపీపీ వీరారెడ్డి, జిల్లా కార్యదర్శి మొగిళి వెంకట్‌రెడ్డి, సొంటిరెడ్డి రంజిత్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీశ్‌రెడ్డి, బక్కి అశోక్, కుసుమ చెన్నకేశవులు, పర్వతగిరి మాజీ జెడ్పీటీసీ బానోతు సింగులాల్, ఆవుల శ్రీనివాస్, తిరుమల్, శ్రీనివాస్, హన్మంతరావు, నాయకులు పాల్గొన్నారు.


