
ముల్కనూరు సహకార సంఘం అభివృద్ధే ధ్యేయం
ఎల్కతుర్తి: ముల్కనూరు సహకార సంఘం అభివృద్ధే లక్ష్యంగా సభ్యులతో కలిసి కృషి చేస్తానని సంఘం అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి అన్నారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూరు సహకార సంఘంలో ఇటీవల ఐదు డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం ముల్కనూరు సహకార సంఘం ప్రధాన కార్యాలయంలో పాలకవర్గ సభ్యులు సమావేశమై అధ్యక్షుడిగా అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డిని, ఉపాధ్యక్షుడిగా గజ్జి వీరయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సహకార సంఘం ఎన్నికల అధికారి కోదండ రాములు సమక్షంలో అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా వారు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సహకార సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత కాశీ విశ్వనాథరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రధాన కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి మాట్లాడుతూ.. సభ్యులు సమష్టి నిర్ణయాలతో అభివృద్ధికి తోడ్పాటునందించాలన్నారు. సహకార సంఘం చేపడుతున్న క్రయవిక్రయాలపై సంఘం కొనసాగుతున్న తీరుపై ఎప్పటికప్పుడు సభ్యుల సలహాలు, సూచనలు తీసుకోనున్నట్లు తెలిపారు. ముల్కనూరు సహకార సంఘ బలోపేతానికి సభ్యులు మరింత కృషి చేయాలన్నారు. తనపై నమ్మకంతో సంఘం అధ్యక్ష బాధ్యతలు 39వ సారి ఏకగ్రీవంగా అప్పగించినందుకు ఆయన సంఘ సభ్యులందరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు కంది రవీందర్‌రెడ్డి, అంబాల రాములు, బేల కనుకమ్మ, ఈర్ల మూగయ్య, చెవ్యల్ల బుచ్చయ్య, గుగ్లోతు భాశు, బొల్లపెల్లి వీరారెడ్డి, మండ శ్రీనివాస్, కర్రె మహేందర్, సంఘం జనరల్ మేనేజర్ ఎం.రామ్‌రెడ్డి, తదితర సభ్యులు పాల్గొన్నారు.
సంఘం అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి
ఐదుగురు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం

ముల్కనూరు సహకార సంఘం అభివృద్ధే ధ్యేయం