
జాతీయ సదస్సులో ప్రాజెక్టు ప్రదర్శన
నర్సంపేట రూరల్: ఢిల్లీలో ఈనెల 26, 27 తేదీల్లో నిర్వహించిన జాతీయ సదస్సులో లక్నెపల్లి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఆంగ్ల ఉపాధ్యాయుడు డాక్టర్ శంకరభక్తుల సత్యం ప్రాజెక్టును ప్రదర్శించారు. అకడమిక్ అచీవ్‌మెంట్ అండ్ ప్రొఫిసిఝెన్సీ ఇన్ లాంగ్వేజ్ అండ్ డిస్‌కోర్సెస్ ప్రాజెక్టును ఎంపిక చేయగా.. గత సంవత్సరం అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు వారానికి రెండు మూడు తరగతులు నిర్వహించినట్లు సత్యం తెలిపారు. విద్యార్థుల్లో ఆంగ్లభాషా నైపుణ్యాలు, డిస్‌కొర్సెస్‌ను పెంపొందించుటకు హెచ్‌ఎం పర్యవేక్షణలో నిర్వహించినట్లు పేర్కొన్నారు. బోధనాంశాలకు సంబంధించిన అంశాలను ఈ జాతీయ సదస్సులో ప్రదర్శించినట్లు ఆయన వివరించారు. ఈసందర్భంగా సత్యంకు సర్టిఫికెట్ అందజేశారు.