
ఎన్నికల్లో ముదిరాజ్‌లను గెలిపించుకోవాలి
దుగ్గొండి: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయనున్న ముదిరాజ్‌లను గెలిపించుకోవాలని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ పిలుపునిచ్చారు. గిర్నిబావిలో ముదిరాజ్ మహాసభ జిల్లా విస్తృతస్థాయి సమావేశం జిల్లా అధ్యక్షుడు పొన్నం మొగిలి అధ్యక్షతన శుక్రవారం గిర్నిబావిలో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా బండా ప్రకాశ్ హాజరై మాట్లాడారు. 2011 జనాభా లెక్కలు, 2024 సమగ్ర కులగణన ప్రకారం రాష్ట్రంలో ముదిరాజ్‌లే అగ్రస్థానంలో ఉన్నారని తెలిపారు. ఏ పార్టీ అయినా ఒక వ్యక్తికి అవకాశం ఇస్తే మరో పార్టీ నుంచి మన వ్యక్తి పోటీ చేయకుండా ఉండాలని సూచించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో ముదిరాజ్‌లను బీసీ–డీ నుంచి బీసీ–ఏలోకి మార్చడానికి చేసిన ప్రయత్నాలు ఆగిపోయాయని వివరించారు. కులాల వారీగా రిజర్వేషన్ల కోసం ప్రభుత్వంపై తనవంతు పోరాటం చేస్తానని తెలిపారు. ఉన్నతస్థాయికి చేరాలంటే ప్రతి ముదిరాజ్ తమ బిడ్డలను చదివించాలని సూచించారు. చేప పిల్లలకు బదులు మత్స్య సహకార సంఘాలకు నేరుగా నిధులు అందించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం ముదిరాజ్ సంఘం జిల్లా నాయకులు గజమాలతో సత్కరించారు. ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్, ఎన్నారై సెల్ రాష్ట్ర కన్వీనర్ శానబోయిన రాజ్‌కుమార్, రైస్ మిల్ల ర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గోనెల రవీందర్, జిల్లా నాయకులు చొప్పరి సోమయ్య, బుస్సా మల్లేఽశం, జినుకల కొమ్మాలు, గోనెల పద్మ, నీరటి సదానందం, గుంటుక సోమయ్య, పోలు అమర్‌చంద్, గుండా రాకేశ్ పాల్గొన్నారు.
ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్