
గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటన
ఐనవోలు : మండలంలోని గర్మిళ్లపల్లి, కక్కిరాలపల్లి, ఐనవోలు గ్రామాల్లో గురువారం స్వచ్ఛ సర్వేక్షన్ కేంద్ర బృందం సభ్యులు పర్యటించారు. తడి, పొడి చెత్త నిర్వహణ, ప్లాస్టిక్ వేస్ట్ యూనిట్, గ్రామ పంచాయతీల పనితీరు, మరుగుదొడ్ల నిర్వహణ, సామాజిక తనిఖీలు నిర్వహించి గ్రామాల్లో పరిశుభ్రత ఎలా ఉందనే అంశాలపై తనిఖీ చేశారు. స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్–2025లో భాగంగా స్వచ్ఛతపై గ్రామాలకు ర్యాంకింగ్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం తనిఖీలు నిర్వహించినట్లు ఎంపీఓ రఘుపతిరెడ్డి తెలియజేశారు. కార్యక్రమంలో ఏపీఓ నక్క కుమారస్వామి, స్వచ్ఛ భారత్ కన్సల్టెండ్ సంపత్‌కుమార్, ఎస్‌ఎస్‌జీ టీం లీడర్ వంగ మధు, కె.జయంత్, రేవంత్, రాజు, పంచాయతీ కార్యదర్శులు రవికుమార్, నిర్మల్ కుమార్, కిశోర్, ఎఫ్‌ఏలు, కారోబార్లు, సిబ్బంది పాల్గొన్నారు.