
మోస్తరు వర్షం
పంచధాత్రులతో అభిషేకం, పాలాభిషేకం, వివిధ రకాల పండ్లు, చెట్ల పసరుతో అభిషేకం చేస్తున్న భద్రకాళి శేషు, శాకంబరీ నవరాత్రి మహోత్సవం సందర్భంగా అమ్మవారి అలంకరణ, అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు
సాక్షి, వరంగల్: పత్తి గింజలు మొలకెత్తేందుకు ఆకాశం వైపు ఎదురుచూస్తున్న రైతులకు వర్షం ఊరటనిచ్చింది. బుధవారం రాత్రి పది నుంచి గురువారం తెల్లవారుజాము నాలుగు గంటల వరకు కురిసిన మోస్తరు వర్షంతో చాలావరకు పత్తి మొలకలు రావడం కనిపించాయి. రెండు వారాల నుంచి అప్పుడప్పుడు వచ్చిపోయిన వాన మాత్రం ఏకధాటిగా కొట్టింది. దీంతో జిల్లాలో ఈ నెలలోనే అత్యధికంగా ఒక్కరోజులో 34.66 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఈ వర్షంతో చాలావరకు దుక్కులు నాని నీరు నిలిచి వరద పోవడం కనిపించింది. వరినార్లు పోసుకునేందుకు అన్నదాతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే సాగు చేసిన మొక్కజొన్నకు కూడా ఈ వర్షం ఊపరి పోసింది. భూమి నానడంతో ఇంకొందరు రైతులు పసుపు పెట్టేందుకు కూడా సిద్ధం అవుతున్నారు. అయితే గురువారం కూడా ఆకాశం మేఘావృతమై ఉండి అక్కడక్కడా వర్షం కురిసింది. ఇన్నాళ్లు ఎండలతో తల్లడిల్లిన రైతులు ఇప్పుడు సంబురంగా చేన్లకు వెళ్తుండడం కనిపిస్తోంది.
నగరంలో తప్పని తిప్పలు..
బుధవారం రాత్రి పది గంటల తర్వాత కురిసిన వర్షంతో వరంగల్ నగరంలోని చాలా ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు పారింది. నాలాల్లో కూడా నీటి ప్రవాహనం పెరిగింది. కొన్నిచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జనాలు చాలా ఇబ్బందులు పడ్డారు. రోడ్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్న కాలనీలు మాత్రం బురదమయంగా మారడంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్నిచోట్ల ద్విచక్రవాహనాలు అదుపుతప్పి కిందపడి పోయారు. పలు ప్రాంతాల్లో చెత్త తరలించే వాహనాలు రాకపోవడంతో ఆయా కాలనీవాసులు ఇబ్బందులు పడ్డారు.
న్యూస్‌రీల్
పత్తి, మొక్కజొన్న పంటలకు జీవం పోసిన వాన
వరినార్లు పోసేందుకు, పసుపు పంట
సాగుకు అనుకూలం
జిల్లాలో 34.66 మిల్లీమీటర్ల
సగటు వర్షపాతం నమోదు
మండలాల వారీగా వర్షపాతం వివరాలు (మిల్లీమీటర్లలో)
మండలం వర్షపాతం
ఖిలావరంగల్ 56.6
వరంగల్ 56.2
గీసుకొండ 55.2
దుగ్గొండి 46.4
ఖానాపురం 42
నర్సంపేట 41.8
నల్లబెల్లి 38
చెన్నారావుపేట 30.8
సంగెం 27
వర్ధన్నపేట 23.6
నెక్కొండ 13.2
పర్వతగిరి 12.8
రాయపర్తి 7.0

మోస్తరు వర్షం

మోస్తరు వర్షం