
గిరిజన గ్రామాలకు సంక్షేమ పథకాలు
గీసుకొండ: గిరిజన గ్రామాలకు సంక్షేమ ఽపథకాలు అందించి, సమస్యలను తీర్చడానికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. నందనాయక్‌తండా గ్రామపంచాయతీ పరిధిలో ‘జనజాతీ గౌరవ్ ఠెళో..ధర్తి ఆభా జనభాగిధారీ అభియాన్’ను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. గిరిజనులు తమ పిల్ల లను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని, గుడుంబా, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సంక్షేమ పథకాలకు అర్హులు కాదని అన్నారు. రూ.52 లక్షల పంచాయతీ నిధులతో కొమ్మాల అంగడి రోడ్డు నిర్మాణం చేపడుతామన్నారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ జిల్లాలో 24 గిరిజన గ్రామాలను అభియాన్ కార్యక్రమానికి ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. 15 రోజులపాటు ఎంపిక చేసిన గ్రామాల్లో అధికారులు అందుబాటులో ఉండి సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చూస్తారన్నారు. ఈ సందర్భంగా వంచనగిరి కేజీబీవీ విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం రైతులకు విత్తన ప్యాకెట్లను ఎమ్మెల్యే, కలెక్టర్ అందించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్‌డీఓ కౌసల్యాదేవి, డీటీడబ్ల్యూఓ సౌజన్య, ఎల్డీఎం రాజ్‌కుమార్, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, మండల స్పెషల్ ఆఫీసర్ సురేశ్, తహపీల్దార్ ఎండీ రియాజుద్దీన్, ఇన్‌చార్జ్ ఎంపీడీఓ పాక శ్రీనివాస్, ఏఓ హరిప్రసాద్‌బాబు, ఏపీఓ చంద్రకాంత్, ఏపీఎం సురేశ్‌కుమర్, మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్య, కాంగ్రెస్ నాయకులు చాడ కొమురారెడ్డి, తుమ్మనపెల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే కొనాయమాకుల, మచ్చాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు.
పరకాల ఎమ్మెల్యే
రేవూరి ప్రకాశ్‌రెడ్డి