
అందుబాటులోకి ‘రైతు నేస్తం’
నెక్కొండ: జిల్లాలోని అన్ని రైతు వేదికలు అందుబాటులోకి రానున్నాయి. అవసరమున్న ప్రాంతాల్లో టీవీ యూనిట్లను బిగిస్తున్నారు. గతంలో మండలానికి ఒకటి చొప్పున 13 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ఉండగా.. ఇప్పుడు అదనంగా మరో 26 యూనిట్లు రైతు వేదికల్లో అందుబాటులోకి రానున్నాయి. వివిధ రకాల పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు జిల్లాలో 39 వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి మంగళవారం రైతు వేదికల్లో నిర్వహించే రైతు నేస్తం ద్వారా పంటల సాగులో పాటించాల్సిన జాగ్రత్తలు, నూతన సాంకేతికతను అధికారులు రైతులకు వివరిస్తారు.