పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగాధిపతి రాజీనామా! | - | Sakshi
Sakshi News home page

పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగాధిపతి రాజీనామా!

Jun 26 2025 6:04 AM | Updated on Jun 26 2025 6:04 AM

పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగాధిపతి రాజీనామా!

పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగాధిపతి రాజీనామా!

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ హెచ్‌ఆర్‌ఎం విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రొఫెసర్‌ పి.శ్రీనివాస్‌రావు ఆపదవికి రాజీనామా చేశారు. ఈమేరకు బుధవారం కేయూ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.రామచంద్రం రాజీనామా పత్రం అందినట్లు ధ్రువీకరించారు. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో పీహెచ్‌డీ, పోస్ట్‌ డాక్టరల్‌ ఫెల్లోషిప్‌ పూర్తి చేసిన అభ్యర్థులు నలుగురున్నారు. ఈనెల 23న ముగ్గురు అభ్యర్థులు పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో వర్క్‌లోడ్‌కు అనుగుణంగా పేపర్‌వైజ్‌గా విద్యాబోధనకు తమకు క్లాస్‌వర్క్‌కు అవకాశం కల్పించి అధ్యాపకులుగా నియమించాలని ఆవిభాగాధిపతి ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. మిగతా విభాగాల్లో వర్క్‌లోడ్‌ చూపించి ఆయా విభాగాల అధిపతులు పేపర్‌వైజ్‌గా విద్యాబోధనకు అధ్యాపకులుగా నియమించారని, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో కూడా ఆ మాదిరిగానే వర్క్‌లోడ్‌ చూపించి తమకు అవకాశం కల్పించాలని విభాగాధిపతి శ్రీనివాస్‌రావును వారు కోరి వినతిపత్రం సమర్పించారు. కాగా.. వినతిపత్రాన్ని శ్రీనివాస్‌రావు పక్కకు వేసిరేసినట్లు.. దీంతో అభ్యర్థులు ఎందుకు విసేరేశారని ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో అభ్యర్థులకు, శ్రీనివాస్‌రావుకు వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. అనంతరం అదే రోజు మనస్తాపంతో శ్రీనివాస్‌రావు విభాగాధిపతి పదవికి రాజీనామా చేస్తూ లేఖను రిజిస్ట్రార్‌కు పంపారు. ఇదిలా ఉంటే బుధవారం కేయూ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.రాంచంద్రం ఆవిభాగానికి వెళ్లి మీరే విభాగాధిపతిగా కొనసాగాలని కోరినట్లు సమాచారం. అయినప్పటికీ తాను కొనసాగనని, తనను రిలీవ్‌ చేయాలని శ్రీనివాస్‌రావు రిజిస్ట్రార్‌ను కోరినట్లు సమాచారం. అయితే ఈవిషయంపై ‘సాక్షి’ రిజిస్ట్రార్‌ రామచంద్రంను వివరణ కోరగా.. నలుగురు పోస్ట్‌డాక్టరల్‌ పూర్తి చేసిన అభ్యర్థుల వర్క్‌లోడ్‌ తెప్పించుకుని పరిశీలిస్తానని అభ్యర్థులకు తెలియజేసినట్లు తెలిపారు. అయితే శ్రీనివాస్‌రావు రాజీనామాను ఆమోదించవద్దని, ఆయననే విభాగాధిపతిగానే కొనసాగించాలని తనకు వినతిపత్రం కూడా ఆయా అభ్యర్థులు అందజేసినట్లు తెలిపారు. శ్రీనివాస్‌రావు రాజీనామాను ఆమోదించలేదని ఈనెల 26న వీసీ ఆచార్య కె ప్రతాప్‌రెడ్డి యూనివర్సిటీకి రానున్నారని.. ఈవిషయంపై నిర్ణయం తీసుకుంటారని వివరణ ఇచ్చారు.

వర్క్‌లోడ్‌ విషయంపై

తలెత్తిన వివాదం

పోస్ట్‌ డాక్టరల్‌ పూర్తి చేసిన

అభ్యర్థులతో వివాదం

శ్రీనివాస్‌రావే కొనసాగాలని కోరిన రిజిస్ట్రార్‌

నేడు వీసీ దృష్టికి వివాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement