
వేయి స్తంభాల ఆలయం ఆదాయం రూ.15,39,722
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలోని హుండీల్లోని కానుకలను మంగళవారం ఉదయం లెక్కించారు. హుండీల్లో భక్తులలు సమర్పించిన కానుకల ద్వారా రూ.7,47,722, పూజా రుసుముల ద్వారా రూ.7,92,000 ఆదాయం మొత్తం రూ.15,39,722 ఆదాయం సమకూరినట్లు దేవాలయ ఈఓ ధరణికోట అనిల్‌కుమార్ వెల్లడించారు. సరస్వతీ పుష్కరాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు దేవాలయాన్ని సందర్శించి స్వామివారికి పూజలు నిర్వహించుకున్నందున అధిక ఆదాయం నమోదైందని ఈఓ తెలిపారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 4గంటల వరకు లెక్కింపు కొనసాగింది. పర్యవేక్షకులుగా దేవాదాయశాఖ పరిశీలకులు ప్రసాద్ వ్యవహరించారు. దేవాలయ ప్రధానా ర్చకుడు గంగు ఉపేంద్రశర్మ, సిబ్బంది మధుకర్, లింగబత్తుల రామకృష్ణ, రజిత, హనుమకొండ పోలీస్ స్టేషన్ సిబ్బంది, వెంకటేశ్వర సేవాసమితి మహిళా భక్తులు పాల్గొన్నారు.