
డ్రగ్స్ రహిత కమిషనరేటే లక్ష్యం
● సీపీ సన్‌ప్రీత్‌సింగ్
వరంగల్ క్రైం: డ్రగ్స్ రహిత వరంగల్ పోలీస్ కమిషనరేట్‌గా గుర్తింపు సాధించడమే మనందరి లక్ష్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాలను పురస్కరించుకుని డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన వాల్‌పోస్టర్లను మంగళవారం సీపీ ఆవిష్కరించారు. ఈసందర్భంగా సీపీ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. మత్తు పదార్థాలను సమాజం నుంచి తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కా వాలని, పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. వారోత్సవాల్లో భాగంగా విద్యాసంస్థల్లో, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో డ్రగ్స్‌పై అవగాహన కల్పించడంతో పాటు, ర్యాలీలు, డ్రాయింగ్, వ్యాస రచన పోటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎవరైనా మత్తు పదార్థాలు విక్రయించినా, వినియోగించినా 87125 84473 నంబర్‌లో సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ రవి, సీసీఆర్‌బీ ఏసీపీ డేవిడ్ రాజు, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
మున్సిపల్ కమిషనర్‌గా కృష్ణ
నర్సంపేట : నర్సంపేట మున్సిపల్ కమిషనర్‌గా కృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణ జీహెచ్‌ఎంసీలో విధులు నిర్వహిస్తుండగా ప్రభుత్వం ఉద్యోగోన్నతి కల్పిస్తూ నర్సంపేటకు బదిలీ చేసినట్టు తెలుస్తోంది. కాగా నెల రోజుల క్రితమే నర్సంపేట మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన కాట భాస్కర్‌ను బదిలీ చేసినట్టు ఆదేశాలు రాకపోవడంతో సందిగ్ధత నెలకొంది.
రుసా 2.0కు రుద్రగూడెం
యువకుడి ఎంపిక
నల్లబెల్లి: రాష్ట్రీయ ఉచ్చతార్ శిక్షా అభియాణ్‌లో భౌతిక శాస్త్రంలో సెంటర్ ఫర్ మాలిక్యూల్స్ అండ్ మెటీరియల్స్ అనే అంశంపై పరిశోధనలు చేసేందుకు ప్రాజెక్ట్ పెల్లోగా నల్లబెల్లి మండలంలోని రుద్రగూడెం శివారు చిన్నతండాకు చెందిన మూడు భద్రమ్మ–సారయ్య దంపతుల కుమారుడు సుమన్ ఎంపికయ్యాడు. ఈ మేరకు ప్రాజెక్ట్ ప్రొఫెసర్ వెంకట్రామ్‌రెడ్డి నియామక పత్రాన్ని మంగళవారం సుమన్‌కు అందజేశారు. సుమన్ ప్రస్తుతం కాకతీయ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రంలో పీహెచ్‌డీ చేస్తున్నాడు. ప్రాజెక్ట్ పెల్లోగా ఎంపికై న సుమన్‌ను కుటుంబ సభ్యులు, స్థానికులు, మిత్రులు అభినందించారు.
డీపీఆర్ త్వరగా
సిద్ధం చేయండి
● మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్: అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ ఏర్పాటుకు అవసరమయ్యే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్)ను త్వరగా సిద్ధం చేయాలని గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. మంగళవారం సాయంత్రం బల్దియా ప్రధాన కార్యాలయంలోని మేయర్ చాంబర్‌లో, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్‌తో కలిసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను తిలకించారు. 66 డివిజన్లకు సంబంధించిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల పురోగతిని సమీక్షించారు. ఈసందర్భంగా బిల్డ్ కాన్ కన్సల్టెన్సీ ప్రతినిధి అగర్వాల్ వివరించారు. సి వరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటు, జోన్ల వారీ గా విభజన, ఎస్టీపీల ఏర్పాటుకు భూ కేటా యింపు,తదితర అంశాలపై వివరించారు. స మావేశంలో ఇన్‌చార్జ్ ఎస్‌ఈ మహేందర్, ఇన్‌చార్జ్ సీపీ రవీందర్ రాడేకర్, బిల్డ్ కాన్ ప్రతినిధి అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
‘అనుమతి లేని ప్రైవేట్
స్కూళ్లను సీజ్ చేయాలి’
నర్సంపేట: నర్సంపేట డివిజన్ పరిధిలోని ప్రభుత్వ అనుమతి లేని ప్రైవేట్ స్కూళ్లను సీజ్ చేయాలని కోరుతూ ఏఐఎఫ్‌డీఎస్ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి గడ్డం నాగార్జున ఆధ్వర్యంలో డీఈఓకు మంగళవారం వినతిపత్రం అందజేశా రు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడారు. పట్టణంలో అనధికారికంగా తొమ్మిది ప్రైవేట్ స్కూళ్లు నడుస్తున్నాయని చెప్పారు. లాయా యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా ఎంఈఓ చర్యలు తీసుకోవడం లేదన్నారు. సమగ్ర విచారణ చేయించాలని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

డ్రగ్స్ రహిత కమిషనరేటే లక్ష్యం