
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
ఖానాపురం: సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ అనిల్‌కుమార్ అన్నారు. మండలంలోని ధర్మరావుపేట గ్రామంలో మంగళవారం వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి డెంగీ జ్వరంతో బాధపడుతుండగా వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు. ఇంటిపరిసరాల్లో దోమల మందును పిచికారీ చేయించారు. అనంతరం అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలు తమ ఇళ్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని చెప్పారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఇతర శాఖల సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. వర్షాకాలం ప్రారంభం అవుతున్న తరుణంలో గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సునీత, సీహెచ్‌ఓ రాజయ్య, సబ్‌యూనిట్ ఆఫీసర్ నంద, కార్యదర్శి అనిత, సిబ్బంది దామోదర్‌రెడ్డి, భాస్కర్, కనకలక్ష్మి, సుజాత, తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ డీఎంహెచ్‌ఓ అనిల్‌కుమార్