
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
పర్వతగిరి: విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని మామునూరు ఏసీపీ వెంకటేష్ సూచించారు. మాదకద్రవ్యాల నిరోధంపై మండలంలోని కల్లెడ ఆర్‌డీఎఫ్ పాఠశాలలో మంగళవా రం విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే మంచి అలవాట్లు, మంచి స్నేహాలను అలవర్చుకోవాలన్నారు. ఉపాధ్యాయులు బోధించే పాఠాలు శ్రద్ధగా విని చదువులో రాణించాలని తెలిపారు. కష్టపడి చదివిస్తున్న తల్లిదండ్రులకు మంచి పేరు పిల్లల ద్వారానే వస్తుందని, అందుకు అనుగుణంగా ముందుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో పర్వతగిరి సీఐ రాజగోపాల్, ఎస్సై ప్రవీణ్, కాలేజ్ ప్రిన్సిపాల్ జనార్ధన్,ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, ఉపాధ్యాయులు రాజు, సంతో ష్, సైదులు, జయశంకర్, ధనలక్ష్మి పాల్గొన్నారు.
మామునూరు ఏసీపీ వెంకటేష్