
నూతన లైన్లతో సమస్యల పరిష్కారం
రాయపర్తి: నూతన విద్యుత్ లైన్లతో విద్యుత్ సరఫరాలో ఏర్పడిన సమస్యను పరిష్కరించవచ్చని ఎన్పీడీసీఎల్ చీ్‌ఫ్ ఇంజనీర్ రాజ్ చౌహాన్ అన్నారు. మండలంలోని సన్నూరు సబ్ స్టేషన్ నుంచి ఊకల్ సబ్‌స్టేషన్ వరకు కొత్తగా నిర్మించిన 33 కేవీ లైన్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లైన్ ఏర్పాటు చేయడం ద్వారా సన్నూరు ఊకల్ సబ్‌స్టేషన్‌లో అంతరాయాలను తగ్గించొచ్చని తెలిపారు. అదేవిధంగా రాయపర్తి సబ్ స్టేషన్‌లో పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ గౌతమ్ రెడ్డి, ఆపరేషన్ డీఈ భిక్షపతి, కన్‌స్ట్రక్షన్ డీఈ హరిజి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్పీడీసీఎల్ చీ్‌ఫ్ ఇంజనీర్ రాజ్ చౌహాన్