మద్యం దుకాణాల మూసివేత | Sakshi
Sakshi News home page

మద్యం దుకాణాల మూసివేత

Published Wed, Nov 29 2023 1:22 AM

- - Sakshi

కరీమాబాద్‌: ఎన్నికల నేపథ్యంలో వరంగల్‌ జిల్లాలోని కల్లు, మద్యం దుకాణాలు, బార్‌లను మంగళవారం సాయంత్రం ఎౖక్సైజ్‌ అధికారులు మూసేశారు. ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశాల మేరకు జిల్లాలోని 63 వైన్స్‌, 7 బార్‌ అండ్‌ రెస్టారెంట్లను మూసివేసి సీల్‌ వేశారు. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో డ్రై డేను పకడ్బందీగా అమలు చేస్తామని జిల్లా ఎకై ్సజ్‌ అధికారి లక్ష్మానాయక్‌ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎక్సైజ్‌ శాఖ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800–425–2523కు సమాచారం అందించాలని ఆయన కోరారు.

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో..

కాజీపేట అర్బన్‌: ఎన్నికల నిబంధనల మేరకు డ్రై డేను అమలు చేస్తున్నట్లు జిల్లా ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ కె.చంద్రశేఖర్‌ తెలిపారు. కలెక్టర్‌ ఉత్తర్వుల మేరకు వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు, ఐఎంసీ డిపోలను మంగళవారం సాయంత్రం 5 గంటలకు మూసివేసినట్లు తెలిపారు. మద్యం అమ్మకాలు జరిపితే కంట్రోల్‌ రూం 0870–2577502 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

కేయూలో మెస్‌లు బంద్‌

కేయూ క్యాంపస్‌: ఓటు హక్కును వినియోగించుకునేందుకు కేయూలోని వివిధ హాస్టళ్ల విద్యార్థులు మంగళవారం స్వస్థలాలకు తరలివెళ్లారు. ఈనేపథ్యంలో క్యాంపస్‌లోని వివిధ హాస్టళ్ల మెస్‌లను మంగళవారం సాయంత్రం నుంచి మూసివేసినట్లు కేయూ హాస్టళ్ల డైరెక్టర్‌ వెంకయ్య తెలిపారు. డిసెంబర్‌ 2న మధ్యాహ్నం నుంచి మెస్‌లు తెరుస్తామని ఆయన తెలిపారు. హాస్టళ్లు మాత్రం తెరిచే ఉంటాయని పేర్కొన్నారు.

30న సెలవు

ఎన్నికల నేపథ్యంలో ఈనెల 30న కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్‌లోని కళాశాలలు, కేయూ పరిధి అనుబంధ కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కేయూ రిజిస్ట్రార్‌ శ్రీనివాస్‌ రావు మంగళవారం సర్క్యూలర్‌ జారీ చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్స్‌, మీటింగ్స్‌, పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

అడ్రస్‌ ఓ చోట.. పోలింగ్‌

కేంద్రం మరోచోట

కాజీపేట: కాజీపేటలోని 47వ డివిజన్‌ రైల్వే క్వార్టర్స్‌లో ఉండే ఓటర్లకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బోడగుట్ట పోలింగ్‌ కేంద్రాన్ని కేటాయించారు. పట్టణంలోని 140, 141 పోలింగ్‌ కేంద్రాలకు సమీపంలోని బాపూజీనగర్‌ పోలింగ్‌ కేంద్రాన్ని వదిలి రైల్వే ట్రాక్‌ అవతల ఉన్న బోడగుట్టను ఎంపిక చేయడంపై ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైల్వే ఉద్యోగుల కుటుంబాలు ఓటేయడానికి చుట్టూ తిరిగి వెళ్లి ఓటు వేయాలి.

అంకితభావంతో

పని చేయండి

హన్మకొండ అర్బన్‌: ప్రశాంత వాతావరణంలో ఎన్నికల్ని పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులంతా అంకితభావంతో కృషి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ నితీశ్‌వ్యాస్‌ అన్నారు. ఎన్నికల నిర్వహణపై మంగళవారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇందులో కలెక్టర్‌, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలన్నారు. మద్యం, నగదు పంపిణీ కట్టడిలో చివరి రెండ్రోజులు కీలకమని తెలిపారు. అనంతరం కలెక్టర్‌ సిక్తా మాట్లాడుతూ.. ఈసీ మార్గదర్శకాలను పాటిస్తూ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్‌ శ్రద్ధాశుక్లా, అధికారులు పాల్గొన్నారు.

1/2

2/2

Advertisement
 
Advertisement